Breaking News

కొత్త చట్టం పట్ల సీఏల్లో ఆందోళన

Published on Mon, 05/15/2023 - 04:24

న్యూఢిల్లీ: చార్టర్ట్‌ అకౌంటెంట్లను నల్లధనం నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విదేశీ పెట్టుబడుల పై, వ్యాపార సులభతర నిర్వహణపై ప్రభావం చూపిస్తుందన్న ఆందోళన పరిశ్రమ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది.

సీఏలతోపాటు, కాస్ట్‌ అకౌంటెంట్లు, కంపెనీ సెక్రటరీలను పీఎంఎల్‌ఏ పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర సర్కారు ఇటీవలే ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. నిధుల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్రం ఈ చర్య తీసుకుంది. సీఏలు, కంపెనీ సెక్రటరీలు భారత్‌లో విదేశీ కంపెనీల ఏర్పాటుకు సహకారం అందిస్తుంటారని, తొలి దశలో విదేశీ కంపెనీల తరఫున తమ సొంత చిరునామా ఇస్తుంటారని పరిశ్రమ వర్గాలు వెల్లడించా యి.

విదేశీ కంపెనీకి రెసిడెంట్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తూ, ఇక్కడ కార్యాలయం ఏర్పాటుకు సాయం అందిస్తుంటారని.. తమ క్లయింట్ల తరఫున బ్యాంకు ఖాతాలను నిర్వహిస్తుంటారని తెలిపాయి. విదేశీ క్లయింట్‌ భారత్‌కు తీసుకొచ్చే పెట్టుబడి సొంతమా లేక నల్లధనమా, వాటి మూలం తెలుసుకునే అవ కాశం సీఏలు, కంపెనీ సెక్రటరీలు లేదని పేర్కొన్నా యి. ప్రాపర్టీల కొనుగోలు, విక్రయం, బ్యాంకు ఖాతాలు లేదా ఆస్తుల నిర్వహణ, లిమిటెడ్‌ లయబి లిటీ పార్ట్‌నర్‌షిప్‌ లేదా ట్రస్ట్‌ల నిర్వహణ వ్యవహారాలన్నీ పీఎంఎల్‌ఏ పరిధిలోకి రానున్నాయి. ఫార్మే షన్‌ ఏజెంట్లు లేదా డైరెక్టర్‌/సెక్రటరీ/పార్ట్‌నర్‌గా వ్యవహరించే వారినీ పీఎంఎల్‌ఏ పరిధిలోకి తీసుకొ స్తూ కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)