Breaking News

ఆఫీసు అద్దెలు పెరిగాయ్‌.. ఖాళీలు తగ్గాయ్‌..

Published on Sat, 11/01/2025 - 13:07

సాక్షి, సిటీబ్యూరో: దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో కార్యాలయాల అద్దెలు 6 శాతం మేర పెరిగాయి. గతేడాది సెప్టెంబర్‌లో అద్దె చ.అ.కు రూ.85గా ఉండగా.. ఇప్పుడది రూ.90కి చేరింది. అత్యధికంగా బెంగళూరులో 9 శాతం మేర ఆఫీసు అద్దెలు పెరిగాయని అనరాక్‌ రీసెర్చ్‌ నివేదిక వెల్లడించింది. ఇదే సమయంలో ఆఫీసు వేకన్సీలు గతేడాది 16.70 శాతంగా ఉండగా.. ఇప్పుడది 16.20 శాతానికి తగ్గింది.

ఈ ఏడాది జనవరి–సెప్టెంబర్‌ తొమ్మిది నెలల్లో ఏడు నగరాల్లో 4.2 కోట్ల చ.అ. ఆఫీసు స్పేస్‌ లావాదేవీలు జరిగాయి. గతేడాది ఇదే కాలంలోని 3.1 కోట్ల చ.అ. లీజులతో పోలిస్తే 34 శాతం అధికం. అలాగే కొత్తగా ఏడు నగరాల్లో 3.9 కోట్ల చ.అ. ఆఫీసు నిర్మాణం పూర్తయింది. గతేడాది 9 నెలల కాలంలోని 3.4 కోట్ల చ.అ.లతో పోలిస్తే ఇది 15 శాతం ఎక్కువ.

ఐటీ హబ్‌ హైదరాబాద్‌లో..

ఐటీ హబ్‌గా పేరొందిన హైదరాబాద్‌లో ఆఫీసు స్పేస్‌ లీజులు బాగానే ఉన్నా కొత్త నిర్మాణాలలో క్షీణత నమోదైంది. ఈ ఏడాది తొలి తొమ్మిది నెలల్లో నగరంలో 57 లక్షల ఆఫీసు లావాదేవీలు జరిగాయి. గతేడాది 9 నెలల్లో 44.2 లక్షల చ.అ. లీజులతో పోలిస్తే 29 శాతం అధికం. అలాగే భాగ్యనగరంలో కొత్తగా 59 లక్షల చ.అ. ఆఫీసు నిర్మాణాలు పూర్తయ్యాయి. గతేడాది ఇదే కాలంలో పూర్తయిన 96.8 లక్షల చ.అ.లతో పోలిస్తే 39 శాతం క్షీణించింది. ప్రస్తుతం నగరంలో ఆఫీసు వేకెన్సీ 26.50 శాతంగా ఉంది.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)