Breaking News

గ్యాస్‌ సిలిండర్‌ ధర తగ్గింపు

Published on Tue, 07/01/2025 - 11:56

దేశవ్యాప్తంగా వాణిజ్య ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గాయి. చమురు మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్ ధరను రూ .58.50 తగ్గించాయి. దీంతో ఢిల్లీలో సిలిండర్ ధర రూ.1,665కు దిగొచ్చింది.

అంతకుముందు జూన్‌లోనూ చమురు సంస్థలు వాణిజ్య సిలిండర్లపై రూ .24 తగ్గింపును ప్రకటించాయి. దాంతో 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ కమర్షియల్‌ గ్యాస్ సిలిండర్ ధర రూ .1,723.50 గా ఉండేది. ఏప్రిల్లో దీని ధర రూ.1,762గా ఉంది. ఫిబ్రవరిలో స్వల్పంగా రూ.7 తగ్గగా, మార్చిలో రూ.6 పెరిగింది.

19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల ధర రూ.58.50 తగ్గించడం చిన్న వ్యాపారులకు ఎంతో ఉపశమనం కలిగిస్తుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య వినియోగదారులు తమ రోజువారీ కార్యకలాపాలకు ఈ గ్యాస్‌ సిలిండర్లపై ఎక్కువగా ఆధారపడతారు.

అయితే, గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ సిలిండర్‌ ధరలో ఎలాంటి మార్పు లేదు. సమీక్షకు పిలుపునిచ్చినప్పటికీ 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్‌పీజీ సిలిండర్ ధర స్థిరంగా ఉంది. 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో ఎలాంటి మార్పు లేదని కంపెనీలు ధృవీకరించాయి.

నగరంకొత్త ధర (రూ.)మునుపటి ధర (రూ.)
ఢిల్లీ1,6651,723.50
ముంబై1,6161,674.50
కోల్ కతా1,7691,826
చెన్నై1,823.501,881
బెంగళూరు1,796
నోయిడా1,747.50
హైదరాబాదు1,798.501,857

Videos

ఆఫ్రికాలో మరో ఇద్దరు భారతీయులు మృతి

ముద్రగడ కుమారుడికి వైఎస్ జగన్ ఫోన్.. తండ్రి ఆరోగ్యంపై ఆరా

117 ఏళ్ల చరిత్ర ఉన్న లాల్ దర్వాజా బోనాలు

CEO చిలక్కొట్టుడు.. లైవ్ లో అడ్డంగా బుక్కైపోయాడు..

లిక్కర్ స్కాం అనేది చంద్రబాబు హయాంలో జరిగింది: సజ్జల

స్పిరిట్ కోసం పూర్తిగా మారిపోయిన ప్రభాస్ లుక్..!

పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టడమే చంద్రబాబు లక్ష్యం

మిథున్ రెడ్డి అక్రమ అరెస్ట్ పై పెద్దిరెడ్డి రియాక్షన్

మమల్ని ఆపడానికి మీరెవరు.. పోలీసులపై లాయర్లు ఫైర్

సీతగా 'సాయిపల్లవి'నే ఎందుకు.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్

Photos

+5

ట్రెండీ వేర్ కాదు.. చీరలో ఒకప్పటి హీరోయిన్ మీనా (ఫొటోలు)

+5

మెగా కోడలు ఉపాసన బర్త్ డే స్పెషల్ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (జులై 20-27)

+5

హైదరాబాద్ లో ఘనంగా బోనాలు (ఫొటోలు)

+5

వరంగల్‌లో సినీనటి నిధి అగర్వాల్‌ సందడి (ఫొటోలు)

+5

లండన్‌లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న నీరజ్ చోప్రా.. (ఫొటోలు)

+5

డస్కీ బ్యూటీ బ్రిగిడ.. చుడీదార్‌లో ఇలా (ఫొటోలు)

+5

యూట్యూబ్‌లో ట్రెండింగ్.. రష్మిక 'నదివే' సాంగ్ HD స్టిల్స్ (ఫొటోలు)

+5

కొంపల్లిలో సందడి చేసిన ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

విశాఖపట్నం : ఐఎన్‌ఎస్‌ నిస్తార్‌ జాతికి అంకితం (ఫొటోలు)