ఏ హామీ లేకుండానే లోన్: నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన

Published on Sun, 11/10/2024 - 14:55

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈ) తయారీ సామర్థ్యాలను పెంపొందించేందుకు కొలేటరల్-ఫ్రీ టర్మ్ లోన్ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. ఈ పథకాన్ని త్వరలోనే కేబినెట్ ముందు ఉంచుతామని నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

బెంగళూరులో జరిగిన నేషనల్ ఎంఎస్ఎంఈ క్లస్టర్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఈ కొలేటరల్-ఫ్రీ టర్మ్ లోన్ స్కీమ్ గురించి వెల్లడించారు. ఈ కొత్త పథకం ద్వారా కేంద్రం ఎంఎస్‌ఎంఈలకు ఏకంగా రూ. 100 కోట్ల వరకు రుణాలను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

నిర్మలా సీతారామన్ వెల్లడించిన ఈ పథకానికి కేంద్ర మంత్రి మండలి అనుమతి దక్కితే ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ.. బ్యాంకుల ద్వారా లోన్ అందిస్తుంది. కేంద్రం అందించే ఈ లోనుకు ఎలాంటి హామీ అవసరం లేదని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

ఎంఎస్‌ఎంఈలు బ్యాంకుల నుంచి వర్కింగ్ క్యాపిటల్‌ను పొందవచ్చు. కానీ వారికి టర్మ్ లోన్‌లు, ప్లాంట్.. మెషినరీ కోసం లోన్ లభించడం లేదని ఈ సందర్భంగా సీతారామన్ పేర్కొన్నారు. అయితే ఇప్పుడు ప్రవేశపెట్టనున్న కొత్త పథకం ద్వారా.. ప్లాంట్స్, యంత్రాలకు కూడా లోన్స్ అందించనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చదవండి: రతన్‌ టాటా చేసిన పని నాకింకా గుర్తుంది.. ఆ రోజు: ప్రధాని మోదీ

ఎంఎస్‌ఎంఈ రంగంలో కర్ణాటక చేస్తున్న కృషిని సీరాటమన్ ప్రశంసిస్తూ.. రాష్ట్రంలో 35 లక్షల సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయని, అవి 1.65 కోట్ల ఉద్యోగాలను కల్పిస్తున్నాయని గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో ఈ రంగం మరింత వృద్ధి చెందుతుందని, ప్రభుత్వం కూడా దీనికి సహకరిస్తుందని ఆమె అన్నారు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)