Breaking News

జీతాల పెరుగుదల.. ఐటీ కంపెనీ శుభవార్త

Published on Thu, 08/14/2025 - 15:17

ఐటీ సేవల దిగ్గజం కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. నవంబర్ 1, 2025 నుంచి అర్హులైన ఉద్యోగుల్లో 80 శాతం మందికి వేతన పెంపును అమలు చేయనుంది. 2025 ద్వితీయార్ధంలో చాలా మంది ఉద్యోగులకు మెరిట్ ఆధారిత వేతన పెంపును అందించే ప్రణాళికలను కంపెనీ తన రెండవ త్రైమాసిక ఆదాయ ప్రకటనలో ధృవీకరించింది.

సీనియర్ అసోసియేట్ స్థాయి వరకు ఉన్న ఉద్యోగులకు వేతన పెంపు వర్తిస్తుందని కంపెనీ ప్రతినిధి పీటీఐకి తెలిపారు. పెంపు శాతం వ్యక్తిగత పనితీరుతో పాటు ఉద్యోగి స్థానంపై ఆధారపడి ఉంటుంది. భారత్‌ ఉద్యోగులలో నిలకడ పనితీరు చూపినవారికి సింగిల్ డిజిట్‌లో, అసాధారణ పనితీరు కనబరిచిన వారికి గణనీయమైన ఇంక్రిమెంట్లు లభించే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధి తెలిపారు.

పెరిగిన నికర లాభం
నాస్‌డాక్‌లో లిస్టైన కాగ్నిజెంట్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 14 శాతం పెరిగి 2025 జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో 645 మిలియన్ డాలర్లకు చేరుకుంది. త్రైమాసిక ఆదాయం 8.1 శాతం పెరిగి 5.25 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

ఇతర కంపెనీల్లో ఇలా..
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సెప్టెంబర్ 1 నుండి దాదాపు 80% మంది ఉద్యోగులకు వేతనాలు పెంచే ప్రణాళికలను ఇటీవలె వెల్లడించింది. నివేదికల ప్రకారం.. ఆఫ్‌షోర్ ఉద్యోగులు 6–8% వరకు, ఆన్‌షోర్ ఉద్యోగులు 2–4% వరకు పెరుగుదల ఉండవచ్చు. ఇక విప్రో, ఇన్ఫోసిస్‌ 2025లో వేతన పెంపు ప్రణాళికలను ఇంకా వెల్లడించలేదు.

👉 ఇది చదివారా? రూ.3 లక్షల కోట్లు ఇస్తా.. గూగుల్‌కే ఆఫర్‌ ఇచ్చిన ఇండియన్‌

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)