Breaking News

కాగ్నిజెంట్‌ సరికొత్త ఎత్తుగడ.. ప్రత్యర్థులకు దడ!

Published on Sun, 01/12/2025 - 12:00

ప్రముఖ బహుళజాతి ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ (Cognizant) భారత్‌లోని తమ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును (retirement age) 58 నుండి 60 సంవత్సరాలకు పెంచింది. విస్తృత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కాగ్నిజెంట్‌ ఈ  నిర్ణయం తీసుకున్నట్లు టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా నివేదిక పేర్కొంది.

పేరోల్‌లో ఎలాంటి మార్పు లేకుండా ఆన్-సైట్‌లో బదిలీ అయిన వారితో సహా దేశంలోని కాగ్నిజెంట్‌ ఉద్యోగులందరికీ ఈ మార్పు వర్తిస్తుంది. అనుభవజ్ఞులను నిలుపుకోవాలనే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ మెమోలో వివరించింది.

దేశంలోని చాలా ఐటీ కంపెనీల్లో (IT Company) ప్రస్తుతం పదవీ విరమణ వయస్సు 58 సంవత్సరాలుగా ఉంది. అయితే రిటైర్మెంట్‌ వయసును పెంచుతూ కాగ్నిజెంట్‌ ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో పోటీతత్వ ప్రపంచంలో సరికొత్త మార్పులు రానున్నాయి. అనుభవజ్ఞులైన నిపుణులను సద్వినియోగం చేసుకునేందుకు కంపెనీకి ఆస్కారం ఏర్పడుతుంది.

చిన్న నగరాలపై దృష్టి
భారత్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో కాగ్నిజెంట్ సీఈవో రవి కుమార్ పీటీఐతో మాట్లాడుతూ.. కంపెనీ ప్రపంచ కార్యకలాపాలలో భారత్‌ పాత్ర ఉంటుందన్నది వివరించారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము నుండి ఇటీవల ప్రవాసీ భారతీయ సమ్మాన్ 2025 అవార్డును  అందుకున్న రవి, గ్లోబల్ టెక్నాలజీ ల్యాండ్‌స్కేప్‌లో భారత్‌కు పెరుగుతున్న ప్రాముఖ్యతను హైలైట్ చేశారు.

“కాగ్నిజెంట్ చాలా పెద్ద కంపెనీ. భారత్‌లో మాకు 250,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇంతకుముందు, మేము పెద్ద నగరాల నుండి ఆపరేట్ చేశాము. ఇప్పుడు మేము చిన్న నగరాల నుండి ఆపరేట్ చేస్తున్నాము. మా ప్రయత్నం చిన్న నగరాలకు తీసుకెళ్లడం, కాబట్టి మేము ఇండోర్‌లో ప్రారంభించాము” అని పేర్కొన్నారు.

పదవీ విరమణ వయస్సును పెంచడంతోపాటు భారత్‌-ఆధారిత ప్రతిభ వ్యూహాన్ని రెట్టింపు చేయడం ద్వారా గ్లోబల్ టెక్నాలజీ పవర్‌హౌస్‌గా ఎదుగుతున్న భారత్‌కు సహకారం అందిస్తూనే ప్రపంచ ఐటీ సేవల మార్కెట్‌లో అగ్రగామిగా తన స్థానాన్ని పటిష్టం చేసుకోవాలని కాగ్నిజెంట్ లక్ష్యంగా పెట్టుకుంది.

Videos

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)