Breaking News

టెక్ కంపెనీ కొత్త చర్య.. భయపడుతున్న ఐటీ ఉద్యోగులు!

Published on Mon, 11/17/2025 - 18:37

ఉద్యోగాలు పోతాయేమో అని ఉద్యోగులు భయపడుతున్న వేళ.. ప్రముఖ ఐటీ కంపెనీ చర్య వారిలో మరింత ఆందోళన కలిగిస్తోంది. కాగ్నిజెంట్ కంపెనీ ఉద్యోగులు తమ ల్యాప్‌టాప్‌లలో ఎంతసేపు యాక్టివ్‌గా ఉంటున్నారు, పని సమయంలో వారు ఏ అప్లికేషన్‌లు లేదా వెబ్‌సైట్‌లను ఉపయోగిస్తారో ట్రాక్ చేయడానికి సిద్ధమైంది. దీనికోసం సంస్థ టెక్నాలజీ సొల్యూషన్స్ ప్రోహ్యాన్స్ వంటి వర్క్‌ఫోర్స్ మేనేజ్‌మెంట్ సాధనాలను ఉపయోగించనున్నట్లు, దీనికోసం ఎంపిక చేసిన ఎగ్జిక్యూటివ్‌లకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించినట్లు సమాచారం.

కొత్త టెక్నాలజీ మాడ్యూల్.. మౌస్, కీబోర్డ్ కార్యకలాపాలను రికార్డ్ చేస్తుంది. తద్వారా ఎంప్లాయిస్ ఎంతసేపు పనిచేయకుండా ఉన్నారో ఇట్టే తెలిసిపోతుంది. 5 నిమిషాలు పనిచేయకుండా ఉంటే.. అలాంటి ఉద్యోగిని 'ఐడిల్' అని ట్యాగ్ చేయనున్నట్లు, ల్యాప్‌టాప్ 15 నిమిషాల పాటు పనిచేయకుండా ఉంటే.. ఉద్యోగి సిస్టమ్ నుంచి దూరంగా ఉండి, ఇతర పనుల్లో నిమగ్నమై ఉన్నట్లు గురిస్తారు. ప్రస్తుతం దీనిని ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

పనితీరును ర్యాంక్ చేయడానికి కాదు
ఈ కొత్త విధానం.. డేటా ప్రక్రియ దశలను అర్థం చేసుకోవడానికి, వినియోగాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించబడిందని కంపెనీ ఉద్యోగులకు తెలిపింది. ఇది వ్యక్తిగత పనితీరును ర్యాంక్ చేయడానికి లేదా రేట్ చేయడానికి కాదని వెల్లడించింది. కానీ వర్క్ ఫ్రమ్ చేస్తున్న ఉద్యోగులపై నిఘా పెట్టడానికే ఇలాంటి కొత్త విధానాలను అమలు చేస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. ఇది ఉద్యోగులలో ఒత్తిడిని పెంచుతుందని అంటున్నారు.

వర్క్ లైఫ్ బ్యాలెన్స్ దెబ్బతింటుంది!
కాగ్నిజెంట్ చర్య వల్ల ఉద్యోగుల వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇబ్బదుల్లో పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగులపై నమ్మకం లేనప్పుడే కంపెనీలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాయి. ల్యాప్‌టాప్ కదలికలను బట్టి ఉద్యోగి పనితీరును అంచనా వేయడం ఎంత వరకు కరెక్ట్ అని కార్మిక సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఇది కంపెనీ - ఉద్యోగుల మధ్య ఉన్న సంబంధాన్ని దెబ్బ తీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇదీ చదవండి: నా దృష్టిలో అది నిజమైన డబ్బు: మిగతాదంతా ఫేక్..

Videos

ఢిల్లీ ఉగ్రదాడి కేసులో వీడని మిస్టరీ ఆ మూడు బుల్లెట్లు ఎక్కడివి?

TS: ప్రజాపాలన వారోత్సవాల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు

Saudi Bus : మృతుల కుటుంబాలకు రూ .5 లక్షల చొప్పు న పరిహారం

సౌదీ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 18 మంది మృతి

Kurnool: తగలబడ్డ లారీ తప్పిన పెను ప్రమాదం

BIG BREAKING : షేక్ హసీనాకు మరణశిక్ష

Sabarimala; వైఎస్ జగన్ ఫొటోతో స్వాముల యాత్ర

హిందూపురంలో వైఎస్ఆర్సీపీ ఆఫీస్‌పై జరిగిన దాడిని ఖండిస్తూ నిరసనలు

కోర్టు ధిక్కర పిటిషన్‌పై తెలంగాణ స్పీకర్‌కు సుప్రీంకోర్టు నోటీసులు

ఐ బొమ్మ వెబ్సైట్ నుంచి మెసేజ్ రిలీజ్

Photos

+5

చిన్నశేష వాహనంపై పరమ వాసుదేవుడు అలంకారంలో శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారి అభ‌యం

+5

బ్లాక్ లెహంగాలో రాణిలా మిస్ ఇండియా మానికా విశ్వకర్మ..!

+5

తిరుప‌తిలో పుష్ప, శిల్పకళా ప్రదర్శన

+5

సీపీ సజ్జనార్‌ను కలిసిన టాలీవుడ్‌ ప్రముఖులు.. ఫోటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ స్టార్స్ (ఫొటోలు)

+5

రింగుల జుట్టు పోరి.. అనుపమ లేటెస్ట్ (ఫొటోలు)

+5

కుమారుడు, సతీమణితో 'కిరణ్‌ అబ్బవరం' టూర్‌ (ఫోటోలు)

+5

విజయవాడ : భవానీ ద్వీపంలో సందడే సందడి (ఫొటోలు)

+5

రాజ్ తరుణ్ 'పాంచ్ మినార్' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

కార్తీక మాసం చివరి సోమవారం..ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు (ఫొటోలు)