Breaking News

దిగ్గజ కంపెనీ కీలక నిర్ణయం.. వేలకోట్ల డీల్

Published on Tue, 06/11/2024 - 15:59

ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కార్పొరేషన్.. సిన్సినాటి, ఒహియోకు చెందిన ఇంజినీరింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ER&D) సర్వీస్ ప్రొవైడర్ 'బెల్‌కాన్‌'ను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

కాగ్నిజెంట్ కంపెనీ ఇప్పుడు బెల్‌కాన్‌ను 1.3 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయనున్నట్లు సమాచారం. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 10800 కోట్లు. కాగ్నిజెంట్ ఈ కంపెనీని కొనుగోలు చేసిన తరువాత తన పరిధిని మరింత విస్తరించనుంది.

ఇక బెల్‌కాన్‌ విషయానికి వస్తే.. ఈ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా సుమారు 60 కంటే ఎక్కువ దేశాల్లో తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఇందులో ఏకంగా 10000 కంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. జనరల్ మోటార్స్, రోల్స్ రాయిస్, బోయింగ్, అమెరికా నేవీ, నాసా వంటి సంస్థలకు ఈ కంపెనీ సేవలు అందిస్తోంది. కంపెనీ విక్రయానికి సంబంధించిన అధికారిక ప్రకటనను బెల్‌కాన్‌ అధికారికంగా ప్రకటించలేదు.

ఒప్పందంలో భాగంగా, బెల్‌కాన్‌ సీఈఓ లాన్స్ క్వానీవ్‌స్కీ నేతృత్వంలో కంపెనీ కొనసాగుతుందని, కాగ్నిజెంట్ యూనిట్‌గా పనిచేస్తుందని కాగ్నిజెంట్ తెలిపింది. బెల్‌కాన్‌ కంపెనీ వార్షిక ఆదాయం రూ. 66 వేలకోట్లు కంటే ఎక్కువని తెలుస్తోంది. ఈ కంపెనీ కొనుగోలుతో కాగ్నిజెంట్ మరింత అభివృద్ధి చెందుతుందని నిపుణులు భావిస్తున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)