Breaking News

కోకాకోలా సీక్రెట్స్‌ అమ్మబోయిన ఉద్యోగి.. పెప్సీ ఏం చేసిందంటే..

Published on Mon, 10/14/2024 - 09:52

ప్రపంచవ్యాప్తంగా కోకాకోలా పానియాలకు ఉన్న ప్రసిద్ధి గురించి తెలిసిందే. తమ ఉత్పత్తులకు సంబంధించిన వాణిజ్య రహస్యాలను అత్యంత పకడ్బందీగా ఉంచుతుంది కోకాకోలా. అయితే ఈ సీక్రెట్స్‌ను అమ్మి సొమ్ము చేసుకోవాలనుకుంది ఓ ఉద్యోగి. కానీ పెప్సీ కంపెనీ ఇచ్చిన షాక్‌తో కటకటాలపాలైంది.

కోకా-కోలా గ్లోబల్ హెడ్‌క్వార్టర్స్‌లో సెక్రటరీగా పనిచేస్తున్న జోయా విలియమ్స్ కొత్త ఉత్పత్తికి సంబంధించిన వ్యాపార రహస్యాలను పెప్సీకి విక్రయించడానికి ప్రయత్నించి అరెస్టు అయింది. జోయా విలియమ్స్, ఆమె సహచరులు ఇబ్రహీం డిమ్సన్, ఎడ్మండ్ డుహానీతో కలిసి దొంగిలించిన కోకాకోలా సమాచారాన్ని 1.5 మిలియన్ డాలర్ల (రూ. 12.6 కోట్లు) భారీ ధరకు విక్రయించడానికి కుట్ర పన్నారు. అయితే పెప్సీ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోకుండా కోకాకోలా​కు, ఎఫ్‌బీఐకి ఫిర్యాదు చేసింది.

ఇదీ చదవండి: కంపెనీ డేటా లీక్‌.. రూ.57 లక్షలు డిమాండ్‌

కోకా-కోలా గ్లోబల్ బ్రాండ్ డైరెక్టర్‌కి అసిస్టెంట్‌గా పనిచేసిన విలియమ్స్, ఒక రహస్య కొత్త ఉత్పత్తిని కలిగి ఉన్న ఫియల్‌ను దొంగిలించి విక్రయించడానికి ప్రయత్నించి పట్టుబడింది. ఎఫ్‌బీఐ ఒక రహస్య ఆపరేషన్‌లో పెప్సీ ఎగ్జిక్యూటివ్‌లుగా నటించి నిందితులను పట్టుకుంది. వీరి మధ్య పలు దఫాలుగా లావాదేవీలు జరిగాయి. ఈ క్రమంలో డిమ్సన్ ఒక కుకీ బాక్స్‌లో దాచిన 30,000 డాలర్లు తీసుకుని కోకాకోలా సీక్రెట్‌ పత్రాలు, ఫియల్‌ను అందజేసారు. విలియమ్స్, ఆమె సహచరులను వారి అక్రమ ఒప్పందం పూర్తయ్యేలోపు అరెస్టు చేయడంతో ఈ అండర్‌కవర్ ఆపరేషన్ ముగిసింది.

Videos

స్థానిక ఎన్నికల సమరం.. జేసీకి పెద్దారెడ్డి ఛాలెంజ్

DSC అక్రమాలపై సంచలన నిజాలు బయటపెట్టిన టీడీపీ కార్యకర్త

బస్సు ఘోర ప్రమాదం.. ప్రయాణికులతో పద్మా నదిలోకి దూసుకెళ్లిన బస్సు!

నేపాల్ సహాయక చర్యల్లో మరో మిరాకిల్

దివ్యతేజ మృతిపై అనుమానాలు,స్టేషన్ కు వెళ్లి.. శవమై వచ్చాడా..?

డీఎస్సీ ఉద్యోగాలపై బొత్స బాంబు.. 14-15 లక్షలకు పోస్టులు అమ్ముకున్నారు..!

మీ పాదయాత్రలో పాల్గొంటే DSC ఉద్యోగాలు పంచేస్తారా?

బాబు నివాసం వద్ద ఉద్రిక్తత కాలర్లు పట్టుకుని..

ఫేక్ సర్టిఫికెట్ల గుట్టు రట్టు? లోకేష్ కాపాడుతున్నారా?

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

Photos

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు