Breaking News

కోకా కోలా నుంచి మద్యం.. రేటెంతో తెలుసా?

Published on Tue, 12/12/2023 - 08:18

కూల్ డ్రింక్ అనగానే ఎక్కువ మందికి గుర్తొచ్చే బ్రాండ్ 'కోకా కోలా' (Coca Cola). ఈ కంపెనీ ఇప్పుడు మన దేశంలో తొలిసారిగా మద్యం విభాగంలోకి అడుగు పెట్టింది. కోకా కోలా మద్యం పేరు ఏమిటి? దాని ధరలు ఎలా ఉన్నాయనే మరిన్ని వివరాలు ఈ కథనంలో చూసేద్దాం..

థమ్స్‌ అప్‌, మ్కా, ఫాంటా, స్ర్పైట్‌, మాజా, కోకా కోలా జీరో షుగర్‌, డైట్‌ కోక్‌, ష్వెప్స్, ఛార్జ్‌డ్‌, కిన్లే, మినిట్‌ మెయిడ్‌, స్మార్ట్‌ వాటర్‌, రిమ్‌ జిమ్‌, హానెస్ట్‌ టీ, కోస్టా కాఫీ, జార్జియా వంటి వాటితో దూసుకెళ్తున్న కోకా కోలా తాజాగా 'లెమన్ డౌ' (Lemon-Dou) అనే పేరుతో మద్యం తయారు చేయడం మొదలు పెట్టింది.

కోకా కోలా 'లెమన్ డౌ' ఇప్పుడు కేవలం గోవా, మహారాష్ట్రలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. గోవాలో దీని ధర రూ. 150 కాగా.. మహారాష్ట్రలో రూ. 230 కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ మద్యం భారతీయులను ఆకర్షిస్తుందా? లేదా? అనే టెస్టింగ్ దశలోనే ఉంది. ఆ తరువాత ఇందులో ఏమైనా మార్పులు చేయాల్సిన అవసరం ఉన్నట్లు గుర్తిస్తే.. కంపెనీ దానికి తగిన విధంగా మద్యం తయారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఈ ఏడాది ఎక్కువ గూగుల్ సెర్చ్ చేసిన విషయాలు ఇవే..

2018లో కోకా కోలా కంపెనీ 'లెమన్ డౌ'ను జపాన్ దేశంలో పరిచయం చేసింది. ఇది చైనా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఇది భారతదేశానికి వచ్చింది. దేశీయ మార్కెట్లో ఈ మద్యం సక్సెస్ అవుతుందా.. లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)