Breaking News

భారీగా తగ్గిన సీఎన్‌జీ, పీఎన్‌జీ ప్రైస్ - కొత్త ధరలు ఇలా..

Published on Sat, 04/08/2023 - 19:31

భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రమే కాకుండా వంట గ్యాస్ ధరలు కూడా భారీగా పెరుగుతున్న సమయంలో CNG, PNG ధరలు తగ్గడం నిజంగా హర్షించదగ్గ విషయం. సీఎన్‌జీ, పీఎన్‌జీ కొత్త ధరలు రేపు (ఏప్రిల్ 09) ఉదయం 6 గంటల నుంచి అమలులోకి వస్తాయి.

ధరల తగ్గుదల తరువాత నోయిడా, ఢిల్లీ, ఘజియాబాద్, గురుగ్రామ్ వంటి ప్రాంతాల్లో ఎలా ఉన్నాయో ఈ కింద చూడవచ్చు.

ఢిల్లీ:
సీఎన్‌జీ: కేజీ రూ. 73.59
పీఎన్‌జీ : ఎస్‌సిఎమ్ (స్టాండర్డ్ పర్ క్యూబిక్ మీటర్) రూ. 48.59

నోయిడా:
సీఎన్‌జీ: కేజీ రూ. 77.20
పీఎన్‌జీ: ఎస్‌సిఎమ్ రూ. 48.46

ఘజియాబాద్:
సీఎన్‌జీ: కేజీ రూ. 77.20
పీఎన్‌జీ: ఎస్‌సిఎమ్ రూ. 48.46

గురుగ్రామ్:
సీఎన్‌జీ: కేజీ రూ. 82.62
పీఎన్‌జీ: ఎస్‌సిఎమ్ రూ. 47.40

కొన్ని నివేదికల ప్రకారం, రానున్న రోజుల్లో దేశ రాజధాని ఢిల్లీలో సీఎన్‌జీ, పీఎన్‌జీ ధరలు మరింత తగ్గే సూచనలు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సీఎన్‌జీ వాహనాలను వినియోగిస్తున్న వినియోగదారులకు ఇది మంచి గుడ్ న్యూస్ అనే చెప్పాలి. భారీగా పెరుగుతున్న ఇంధన ధరల నుంచి విముక్తి పొందటానికి సీఎన్‌జీ మంచి ప్రత్యామ్నాయం అని చెప్పాలి.

(ఇదీ చదవండి: రూ. 30వేల కోట్ల సంపదకు అధిపతి - ఎవరీ లీనా తివారీ?)

దేశీయ మార్కెట్లో మారుతి సుజుకి, టయోటా వంటి వాహన తయారీ సంస్థలు కూడా సీఎన్‌జీ వాహనాలను విడుదల చేశాయి. రానున్న రోజుల్లో మరిన్ని కంపెనీలు కొత్త ఉత్పత్తులను విడుదల చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నాము. పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే సీఎన్‌జీ వాహనాలు అధిక మైలేజ్ అందించడం వల్ల ఎక్కువ మంది ఈ కార్లను ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)