సీఎన్‌జీ.. సూపర్‌ క్రేజ్‌!

Published on Tue, 07/21/2026 - 05:10

దేశీ కార్ల మార్కెట్లో ఇంధన ప్రాధాన్యతల ట్రెండ్‌ మారుతోంది. పెట్రోల్, డీజిల్‌ ధరల సెగకు తోడు కాలుష్య నిబంధనల్లో నెలకొన్న అనిశ్చితితో కారు ప్రియులు ఇప్పుడు కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (సీఎన్‌జీ)తో నడిచే కార్లకు సై అంటున్నారు. అధిక మైలేజీ.. తక్కువ మెయింటెనెన్స్‌.. పెట్రోల్‌ ఆప్షన్‌ కూడా ఉండటంతో సీఎన్‌జీ కార్లు మార్కెట్‌ వాటాను కొల్లగొడుతున్నాయి. గతంలో అరకొరగా ఉన్న బంకులు ఇప్పుడు శరవేగంగా విస్తరిస్తుండటం కూడా దీనికి మరో ప్రధాన కారణం. మొత్తంమీద డీజిల్‌ను ఓవర్‌టేక్‌ చేసి సీఎన్‌జీ కార్లు అమ్మకాల్లో టాప్‌–2 ప్లేస్‌లో దూసుకెళ్తున్నాయి.

మన రోడ్లపై ఇప్పటికీ పెట్రోల్‌ కార్లదే హవా. అయితే, గత రెండు మూడేళ్లుగా కొనుగోలుదారులు ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మరింత ఫోకస్‌ చేస్తున్నారు. దీంతో కార్ల విక్రయాల్లో సీఎన్‌జీ వరుసగా రెండో ఏడాది కూడా దేశంలో రెండో అత్యంత ప్రాధాన్య ఇంధనంగా నిలిచింది. 2025–26లో అమ్ముడైన మొత్తం కార్లలో సీఎన్‌జీ వాటా దాదాపు 22 శాతానికి ఎగబాకింది. అంటే 10 లక్షలకు పైగా సీఎన్‌జీ కార్లు రోడ్డెక్కాయన్నమాట! 2024–25లో సీఎన్‌జీ కార్ల వాటా 19.6 శాతంగా ఉంది.

 మూడేళ్ల క్రితం 12–13 శాతం వాటా ఉండగా.. ఇప్పుడు ఏకంగా రెట్టింపైంది. మరోపక్క, గతేడాదే డీజిల్‌ కార్లను దాటేసిన సీఎన్‌జీ కార్ల జోరు అంతకంతకూ పెరుగుతుండటం విశేషం. 2025–26లో డీజిల్‌ కార్ల వాటా 18.23 శాతం నుంచి 2026–27లో 18.08 శాతానికి తగ్గింది. పెట్రోల్‌ కార్లదీ ఇదే బాట. తొలిసారిగా 2025–26లో వాటి వాటా 50 శాతం దిగువకు పడిపోవడం గమనార్హం. ఇక ఎలక్ట్రిక్‌ వాహనాలు (ఈవీలు), హైబ్రిడ్‌ కార్ల విక్రయాలు కూడా రయ్‌ అంటున్నాయి. గతేడాది ఈవీల వాటా 2.61% నుంచి 4.25 శాతానికి ఎగబాకడం దీనికి నిదర్శనం. 

జూన్‌లోనూ జూమ్‌... 
ప్రత్యామ్నాయ ఇంధనాలైన సీఎన్‌జీ, ఎలక్ట్రిక్, హైబ్రిడ్‌ కార్లు ఈ ఏడాది జూన్‌లో కూడా దుమ్మురేపాయి. రిటైల్‌ సేల్స్‌లో తొలిసారి వీటి వాటా 40 శాతాన్ని అధిగమించింది. 2025 జూన్‌లో ఇది 33.3 శాతమే. అలాగే ఈ ఏడాది మేలో 38 శాతంగా ఉంది. మరోపక్క, పెట్రోల్, డీజిల్‌ కార్ల వాటా 60 శాతం దిగువకు పడిపోయింది. ఇక సీఎన్‌జీ కార్లు తగ్గేదేలే అంటూ టాప్‌గేర్లో అమ్ముడయ్యాయి. జూన్‌ అమ్మకాల్లో సీఎన్‌జీ వాటా 24.3 శాతానికి ఎగసింది. హైబ్రిడ్‌ 8.3%, ఈవీలు 7.8% వాటా (31,823 కార్లతో ఆల్‌టైమ్‌ గరిష్టం) దక్కించుకున్నాయి.

ఎందుకీ డిమాండ్‌..
→ కారు కొనుగోలుదారులు సీఎన్‌జీకి జై కొట్టడానికి అధిక మైలేజీ, తక్కువ నిర్వహణ వ్యయమే ప్రధాన కారణం. పెట్రోల్‌తో పోలిస్తే సీఎన్‌జీ కార్లకు ఒక్కో కిలోమీటర్‌ జర్నీకి అయ్యే ఖర్చు 40–50 శాతం తక్కువ. 

→ నేరుగా కంపెనీలు విడుదల చేస్తున్న సీఎస్‌జీ వేరియంట్ల రేటు పెట్రోల్‌ కంటే రూ.80,000–1,00,000 ఎక్కువగా ఉంటోంది. అంటే, ఏటా సుమారు  15,000–20,000 కిలోమీటర్లు తిరిగేవారికి ఈ అదనపు వ్యయం 18 నెలల్లోనే రికవరీ అయిపోతుంది. అవసరమైతే పెట్రోలు ఆప్షన్‌ ఉండనే ఉంటుంది. ఈ వెసులుబాటు, ఇంధన ఆదానే ఇప్పుడు మాస్‌ మార్కెట్లో సీఎస్‌జీ కార్లకు కిర్రాక్‌ క్రేజ్‌ తెచ్చిపెడుతోంది. 

→ సీఎన్‌జీ బంకులు శరవేగంగా విస్తరిస్తుండం కూడా ఈ కార్ల వైపు కస్టమర్లు మరింతగా మొగ్గుచూపుతున్నారు. ఏడాది క్రితం సిటీ గ్యాస్‌ డి్రస్టిబ్యూషన్‌ నెట్‌వర్క్‌ 300 నగరాలు, పట్టణాల్లో ఉండగా.. ఇప్పుడు వాటి సంఖ్య 600కు చేరింది.  

→ ఇదంతా ఒకెత్తయితే.. పశ్చిమాసియా సంక్షోభం దెబ్బతో పెట్రోల్, డీజిల్‌ ధరలు భారీగా పెరగడం కూడా ఎక్కువ మంది సీఎన్‌జీని నమ్ముకుంటున్నారు. ఆటోమొబైల్‌ డీలర్ల సంఘాల ఫెడరేషన్‌ (ఫాడా) సర్వే ప్రకారం ఇంధన ధరల పెరుగుదల, తక్కువ నిర్వహణ ఖర్చుల నేపథ్యంలో సీఎన్‌జీ, ఈవీలే బెటర్‌ అని 56.9% మంది కస్టమర్లు భావిస్తున్నారట! 

→ కాలుష్య నిబంధనలను కఠినతరం చేస్తుండటం వల్ల కూడా డీజిల్‌ కార్ల నుంచి సీఎన్‌జీ, ఇతరత్రా ప్రత్యామ్నాయ ఇంధనాల వైపు మళ్లేలా చేస్తోంది. ఢిల్లీ–ఎన్‌సీఆర్‌లో డీజిల్‌ వాహనాల కాలపరిమితిని పదేళ్లకు తగ్గించడం, మరిన్ని నగరాలూ ఇదే బాటలో నడుస్తాయన్న ఆందోళనలు, పాలసీ అనిశ్చితి డీజిల్‌ కార్ల డిమాండ్‌కు కోత పెడుతోంది. పెట్రోల్, డీజిల్‌ కార్లతో పోలిస్తే సీఎన్‌జీ వల్ల కాలుష్యం చాలా తక్కువ. 

→ గతంలో ఎంట్రీ స్థాయి మోడళ్లలోనే అందుబాటులో ఉన్న సీఎన్‌జీ వేరియంట్లను ఆటోమొబైల్‌ దిగ్గజాలు ఇప్పుడు అన్ని మోడళ్లకూ విస్తరించాయి. మారుతీ సుజుకీ దాదాపు తన మొత్తం కార్ల రేంజ్‌లో ఫ్యాక్టరీ ఫిటెడ్‌ సీఎన్‌జీ ఆప్షన్లను అందిస్తోంది. ఇక టాటా మోటార్స్‌ సైతం జోరు పెంచింది. నెక్సాన్, పంచ్, టియాగో, ఆల్ట్రోజ్‌తో పాటు టాప్‌ ఎండ్‌ మోడళ్లలో సైతం సీఎన్‌జీ వేరియంట్లను ప్రవేశపెట్టింది. హ్యుందాయ్‌ సైతం ఇదే బాటలో పయనిస్తోంది. జూన్‌లో 2–3 శాతం మేర ధరలు పెరిగినా, సీఎన్‌జీ కార్లకు డిమాండ్‌ ఏమాత్రం తగ్గలేదన్నది డీలర్ల మాట.

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌

Videos

కాక్రోచ్ ఉద్యమం వెనుక పూర్తి కథ ఇదే !

సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ నిర్ణయం వల్లనే ఈ ఉద్యమం మొదలయింది..! కాక్రోచ్ పార్టీ వెనుక ఉన్నది...?

బాబుకు షాక్ ఇచ్చిన సొంత సర్వే.. జగన్ దెబ్బకు కూటమి బాక్స్ బద్దలు

శుక్రవారం శ్రీ వారాహి పూజ

ధర్మేంద్ర ప్రధాన్ తో రాజీనామా చేయిస్తే తర్వాత జరిగేది ఇదే..

AP గ్రాఫ్ ఢమాల్.. బాబు పరువు గోవిందా..

జోమాటో నుండి అంత ఫుడ్ ఏవరు పంపారంటే? CJP కి అంతమంది సపోర్ట్ ఎందుకు ?

కేటీఆర్ ను ఆశీర్వదించిన కేసీఆర్.. బర్త్ డే రోజే సంచలన నిర్ణయం!

లోపల చర్చలు.. బయట లారీ ఛార్జ్.. మోడీ వీడియో వెనుక బీజేపీ వ్యూహం అదే

మీ 20మంది విద్యార్థులు చనిపోయారు..! ఒక్కొక్కరికి కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వండి

Photos

+5

హైదరాబాద్ : శిల్పకళా వేదికలో ధన్య ప్రసాద్ కూచిపూడి (ఫొటోలు)

+5

విజయవాడ : ఆషాఢ సారెతో అమ్మవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

కొత్త లోకా బ్యూటీకి బిగ్‌ ఛాన్స్‌.. ఏకంగా దురంధర్‌ హీరోతో..! (ఫోటోలు)

+5

ఏపీ : అద్భుతమైన వేంకటేశ్వరస్వామి ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

గుజరాత్‌లో వర్ష బీభత్సం...నీట మునిగిన కార్లు (ఫొటోలు)

+5

'కేరింత' నటి సుకృతి సీమంతం వేడుక (ఫొటోలు)

+5

బిజినెస్‌మ్యాన్‌ని పెళ్లి చేసుకున్న ప్రముఖ నటి (ఫొటోలు)

+5

అందాల బొమ్మలా యంగ్ హీరోయిన్ శ్రీదేవి (ఫొటోలు)

+5

రిలీజైన 'చెన్నై లవ్ స్టోరీ'.. ట్రెండింగ్‌లో గౌరిప్రియ (ఫొటోలు)

+5

నల్ల చీరలో గ్లామరస్ మలయాళ కుట్టి (ఫొటోలు)