Breaking News

రూ.13 లక్షలు ఆదాయం ఉంటే ట్యాక్స్‌ ఇలా..

Published on Sun, 02/02/2025 - 08:34

కేంద్రబడ్జెట్‌ 2025-26లో నిర్మలా సీతారామన్‌ సామాన్యుడికి రూ.13 లక్షల వరకు ఆదాయపన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే చాలామందికి ఇది ఎలా వర్తిస్తుందో అనుమానాలున్నాయి. అయితే ఒక ఉదాహరణతో దీనిపై స్పష్టతకు వద్దాం. మీ వార్షిక వేతనం రూ.13 లక్షలనుకోండి. మీరు రిబేట్‌ పరిధిలోకి రారు. ఎందుకంటే మీ ఆదాయం ప్రభుత్వం ప్రకటించిన రూ.12 లక్షల కంటే ఎక్కువ ఉంది. మీ సంపాదన రూ.13 లక్షల నుంచి రూ.75వేలు స్టాండర్డ్‌ డిడక్షన్‌ తీసేయగా మిగిలిన రూ.12.25 లక్షలకు శ్లాబుల ప్రకారం పన్ను పడుతుంది.

ఇందులో రూ.4 లక్షలవరకూ జీరో ట్యాక్స్‌

రూ.4 –8 లక్షల ఆదాయానికి 5 శాతం.. అంటే 20వేలు

మిగిలిన నాలుగు లక్షలు.. రూ.8–12 లక్షల ఆదాయానికి 10 శాతం అంటే 40 వేలు

మిగిలిన 25 వేలపై 15 శాతం అంటే రూ.3,750గా లెక్కిస్తారు.

మొత్తంగా రూ.4-8 లక్షలు- 5 శాతం ట్యాక్స్‌ రూ.20,000

రూ.8-12 లక్షలు(మిగిలిన రూ.4 లక్షలనే పరిగణిస్తారు)-10 శాతం ట్యాక్స్‌ రూ.40,000

రూ.12-16 లక్షలు(మిగిలిన రూ.25,000కు)- 15 శాతం ట్యాక్స్‌ రూ.3,750

మొత్తం కలిపి రూ.13 లక్షలు ఆదాయం ఉంటే స్టాండర్డ్‌ డిడక్షన్స్‌ పోను మీరు చెల్లించాల్సిన ట్యాక్స్‌ రూ.63,750.

ఇదీ చదవండి: స్టార్టప్‌లకు జోష్‌

రూ.12.75 లక్షలకు ఒక్క రూపాయి మించినా..

నిజానికి పన్ను మినహాయింపు పరిమితిని రూ.7 లక్షల నుంచి రూ.12 లక్షలవరకూ పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించటంతో చాలామంది తమకు రూ.15 లక్షల వేతనం ఉన్నట్లయితే కేవలం రూ.3 లక్షలపై పన్ను చెల్లిస్తే చాలుననే అపోహల్లో ఉన్నారు. వాస్తవానికి ఆర్థిక మంత్రి పెంచింది పన్ను మినహాయింపు పరిమితిని కాదు. పన్ను రిబేట్‌ పరిమితిని అని గుర్తుంచుకోవాలి.

అంటే... 12 లక్షల లోపు ఆదాయం ఉన్నవారు రిబేట్‌ పరిధిలోకి వస్తారు. కాబట్టి వారికి పన్ను ఉండదు. దీనికి ఎలాగూ స్టాండర్డ్‌ డిడక్షన్‌గా పేర్కొనే రూ.75వేలను కలుపుతారు. అంటే రూ.12.75 లక్షల వరకూ వార్షిక వేతనం ఉన్నవారు రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన పనిలేదు. దీనిప్రకారం చూసుకుంటే నెలకు రూ.1,06,250 వేతనం అన్నమాట. అయితే దీనికన్నా ఒక్క రూపాయి దాటినా వారు రిబేట్‌ పరిధిని దాటిపోతారు. కాబట్టి సహజంగా పన్ను శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)