Breaking News

8 గంటలు ఫోన్‌ లేకుండా.. రూ.లక్ష బహుమతి

Published on Mon, 12/09/2024 - 14:45

ప్రస్తుత రోజులలో స్మార్ట్‌ ఫోన్‌కు మనుషులు ఎంతలా బానిసలయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్మార్ట్‌ ఫోన్‌ లేకుండా నిమిషం ఉండాలన్న కష్టమే. కానీ చైనాలో ఒక మహిళ ఎనిమిది గంటల పాటు మొబైల్ ఫోన్ వినియోగానికి దూరంగా ఉండే పోటీలో విజేతగా నిలిచి 10,000 యువాన్లను (రూ.1,16,000) గెలుచుకుంది.

స్థానిక జిము న్యూస్ రిపోర్ట్‌ ప్రకారం, పోటీ నవంబర్ 29న చాంగ్‌కింగ్ మునిసిపాలిటీలోని ఒక షాపింగ్ సెంటర్‌లో జరిగింది. 100 మంది దరఖాస్తుదారుల నుండి ఎంపిక చేసిన పది మంది ఈ పోటీలో పాల్గొన్నారు. వీరు తమకు కేటాయించిన బెడ్‌పై ఎనిమిది గంటలు గడపవలసి ఉంటుంది. పోటీకి ముందు, వారి నుంచి మొబైల్ ఫోన్‌లను తీసేసుకున్నారు. ఐప్యాడ్‌లు, ల్యాప్‌టాప్‌లతో సహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా వాడటానికి వీల్లేదు. అత్యవసర పరిస్థితుల్లో తమ కుటుంబ సభ్యులతో కాలింగ్ సౌకర్యం మాత్రమే పాత మొబైల్ ఫోన్ ఉపయోగించవచ్చు.

పోటీ జరుగుతున్నంత సేపూ బెడ్ మీదే ఉండాలి. టాయిలెట్ కు వెళ్లొచ్చు. పానీయాలు, భోజనం అక్కడికే అందించారు. పోటీదారులు నిద్రలోకి జారుకోకూడదు. ఎటువంటి ఆందోళనను ప్రదర్శించకూడదు. ఇందుకోసం వారి నిద్ర, ఆందోళన స్థాయిలను పర్యవేక్షించడానికి వారి చేతి మణికట్టుకు పట్టీలను అమర్చారు. చాలా మంది పోటీదారులు పుస్తకాలు చదవడం ద్వారానో లేదా కళ్ళు మూసుకుని విశ్రాంతి తీసుకోవడం ద్వారానో సమయాన్ని గడిపారు. చివరికి, డాంగ్ అనే మహిళ 100కి 88.99 స్కోర్‌ను సాధించి ఛాంపియన్‌గా నిలిచారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)