Breaking News

పిల్లల్ని కంటే రూ.5.6 లక్షలు.. ఉద్యోగులకు కంపెనీ బంపరాఫర్‌!

Published on Sat, 07/01/2023 - 18:29

ప్రపంచంలో అత్యంత జనాభా ఉన్న చైనా ఇ‍ప్పుడు యువత జనాభా తగ్గి వయసు మళ్లిన వారి సంఖ్య పెరిగిపోవడంతో ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో పిల్లల్ని కనాలని ఆ దేశ ప్రభుత్వం కూడా అక్కడ జంటలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో చైనాలో అతిపెద్ద ట్రావెల్‌ ఏజెన్సీ ట్రిప్‌ డాట్‌ కామ్‌ తమ ఉద్యోగులకు బంపరాఫర్‌ ఇచ్చింది.

ఐదేళ్లలో రూ.5.6 లక్షలు
కంపెనీలో పనిచేసే ఉద్యోగులు పిల్లల్ని కంటే ఒక్కో శిశువుకు ఏడాదికి 10,000 యువాన్లు (రూ.1.1 లక్షలు) చొప్పున ఐదేళ్లపాటు అందిస్తామని ట్రిప్‌ డాట్‌ కామ్‌ సంస్థ ప్రకటించింది. అంటే ఒక్కో బిడ్డకు ఐదేళ్లలో  మొత్తంగా 50,000 యువాన్లు (రూ.5.6 లక్షలు) లభిస్తాయి. జూన్‌ 30న ప్రకటించిన ఈ ఆఫర్‌ జూలై 1 నుంచి అమల్లోకి వస్తుంది.

వారికి మాత్రమే..
ఈ చైల్డ్‌ కేర్‌ బినిఫిట్లు కంపెనీలో మూడేళ్లకు పైగా పని చేస్తున్న ఉద్యోగులకు మాత్రమే. "మా ఉద్యోగులు వారి వృత్తిపరమైన లక్ష్యాలు, సాధనలపై రాజీ పడకుండా వారి కుటుంబాలను పోషించుకునేలా ప్రోత్సహిస్తూ ఆర్థిక సహాయాన్ని అందించే లక్ష్యంగా ఈ చైల్డ్‌కేర్ బెనిఫిట్‌ను ప్రవేశపెట్టాం" అని ట్రిప్‌ డాట్‌ కామ్‌ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ జేమ్స్ లియాంగ్ చెప్పినట్లుగా సీఎన్‌ఎన్‌ వార్తా కథనం పేర్కొంది.

 

కాగా చైల్డ్‌ కేర్‌ బినిఫిట్ల కోసం కంపెనీకి సుమారు 1 బిలియన్ యువాన్ (దాదాపు రూ.1131 కోట్లు)  ఖర్చు అవుతుంది. చైనాలో ఒక ప్రైవేట్ కంపెనీ ఈ తరహాలో చైల్డ్‌ కేర్‌ బినిఫిట్లు ప్రారంభించడం ఇదే తొలిసారి. చైనా జననాల రేటు గత ఏడాది 1,000 మందికి గానూ 6.77 జననాలకు పడిపోయింది. ఇది 2021లో 7.52 జననాలుగా ఉండేది. ఇది రికార్డ్‌ స్థాయి అత్యంత తక్కువ జననాల రేటు.

కొత్త తరం జనాభాను ప్రోత్సహించేందుకు 2021లో చైనా ప్రభుత్వం ప్రతి జంట ముగ్గురు పిల్లలను కనేందుకు అవకాశం ఇచ్చారు. కోవిడ్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్నప్పటికీ పిల్లలను కనడంపై జంటలు ఆసక్తి చూపించలేదు. తక్కువ ఆదాయం, పెరిగిన పిల్లల సంరక్షణ, విద్యా ఖర్చులు వంటివి ఇందుకు కారకాలుగా ఉన్నాయి.

ఇదీ చదవండి: గుడ్‌న్యూస్‌.. డబుల్‌ డిజిట్‌ బాటలో వేతన ఇంక్రిమెంట్లు

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)