Breaking News

‍అమెరికాపై ప్రతిచర్యలు తప్పవు: చైనా

Published on Thu, 04/03/2025 - 13:02

ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారీ సుంకాలను ప్రకటించిన నేపథ్యంలో చైనా స్పందించింది. యూఎస్‌ తన సుంకాల విధానాలను వెంటనే రద్దు చేయాలని కోరింది. దేశ ప్రయోజనాలు కాపాడుకునేందుకు ప్రతిచర్యలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

కొన్నేళ్లుగా ఇరుదేశాలతో వాణిజ్య చర్చల్లో కుదిరిన ప్రయోజనాలను, అంతర్జాతీయ వాణిజ్యం ద్వారా చాలా కాలంగా ఎంతో లాభం పొందిందనే వాస్తవాన్ని అమెరికా విస్మరించిందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ సరఫరా గొలుసులను దెబ్బతీసే వాణిజ్య యుద్ధానికి దిగుతున్న నేపథ్యంలో చైనా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని చెప్పింది. తన హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు ప్రతిచర్యలు తప్పవని హెచ్చరించింది.

ఇదీ చదవండి: ప్రతీకార సుంకాలపై భారత ఫార్మాకు ఊరట!

ఈ ఏడాది ప్రారంభంలో యూఎస్‌పై చైనా విధించిన 20% సుంకాల కంటే అదనంగా చైనాపై 34% సుంకం విధిస్తున్నట్లు ట్రంప్ బుధవారం ప్రకటించారు. దాంతో మొత్తం సుంకాలు 54%కు పెరిగినట్లయింది. అమెరికా ఎన్నికల నేపథ్యంలో ట్రంప్‌  ప్రచారం చేసినట్టుగానే చైనాపై 60% సుంకాలు విధింపునకు సమీపంలోకి చేరింది. చైనా, హాంకాంగ్ నుంచి వచ్చే తక్కువ విలువ కలిగిన ‘డ్యూటీ ఫ్రీ(సుంకాలు మినహాయింపు)’ వస్తువులను అమెరికాలోకి అనుమతించే వాణిజ్య విధానాన్ని రద్దు చేస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)