Breaking News

భారత్‌లో ‘యాపిల్‌’కు చెక్‌ పెట్టేలా చైనా కుతంత్రాలు

Published on Thu, 07/03/2025 - 13:41

భారతదేశం గ్లోబల్ ఐఫోన్ తయారీ కేంద్రంగా ఎదగడాన్ని డ్రాగన్‌ దేశం జీర్ణించుకోలేకపోతుంది. ఎలాగైనా భారత్‌ వృద్ధి ఆపాలనే వక్రబుద్ధితో ఇండియాలో పని చేస్తున్న నైపుణ్యాలు కలిగిన టెక్నీషియన్లను తిరిగి చైనా వెనక్కి పిలిపించుకుంటోంది. యాపిల్‌ తర్వలో ఐఫోన్ 17ను విడుదల చేయనున్న నేపథ్యంలో ఈమేరకు ఫోన్ల తయారీలో భారత్‌ గ్లోబల్ హబ్‌గా మారకుండా చైనా కుంతంత్రాలు చేస్తోంది.

గత రెండు నెలల్లో భారత్‌లో యాపిల్‌ ఉత్పత్తులు తయారు చేస్తున్న ఫాక్స్‌కాన్‌ తన భారతీయ ప్లాంట్ల నుంచి 300 మందికి పైగా చైనా ఇంజినీర్లను, సాంకేతిక నిపుణులను వెనక్కి పిలిపించింది. ఈ చర్యలకు చైనా కారణమని కొందరు నిపుణులు విశ్వసిస్తున్నారు. యాపిల్ సరఫరా గొలుసుపై ప్రభావం చూపేందుకు, భారత్‌ ఎగుమతులకు చెక్‌ పెట్టేలా బీజింగ్ చేసిన రహస్య వ్యూహాత్మక చర్యగా దీన్ని పరిగణిస్తున్నారు.

అసలేం జరిగిందంటే..

యాపిల్ అతిపెద్ద తయారీ భాగస్వామి ఫాక్స్‌కాన్‌ దక్షిణ భారతదేశంలో కొత్త ఐఫోన్ అసెంబ్లింగ్ ప్లాంట్‌ను నిర్మిస్తోంది. ఇందులో చైనీస్ ఇంజినీర్లు ప్రొడక్షన్‌ లైన్లను ఏర్పాటు చేయడానికి, భారతీయ సిబ్బందికి శిక్షణ ఇచ్చేందుకు, యాపిల్ కఠినమైన నాణ్యతా ప్రమాణాలను నిర్వహించడానికి కీలకంగా వ్యవహరిస్తున్నారు. త్వరలో యాపిల్‌ ఐఫోన్‌ 17ను లాంచ్‌ చేయనుంది. ఈమేరకు భారత్‌లో ఉత్పత్తి పెంచాలని చూస్తోంది. ఈ సమయంలో చైనా ఫాక్స్‌కాన్‌పై ఒత్తిడి తెచ్చి రెండు నెలల వ్యవధిలో ఇక్కడి ప్లాంట్లలో పని చేస్తున్న 300 చైనా నిపుణులను వెనక్కి పిలిపించింది. కేవలం సహాయక సిబ్బందిని మాత్రమే భారత్‌ సైట్‌ల్లో  ఉంచుతుంది.

ఇదీ చదవండి: ‘సీఎం వ్యాఖ్యలు పూర్తి అవాస్తవాలు’

ఈమేరకు ఆగ్నేయాసియా దేశాలకు అత్యాధునిక పరికరాలు, నైపుణ్యం కలిగిన కార్మికుల ఎగుమతులను పరిమితం చేయాలని చైనా కంపెనీలకు మౌఖికంగా ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్య 2026 నాటికి చాలా వరకు అమెరికాకు చెందిన ఐఫోన్ ఉత్పత్తిని భారతదేశానికి తరలించాలన్న యాపిల్ లక్ష్యానికి సవాలుగా మారుతుంది.

#

Tags : 1

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)