Breaking News

కీలక వడ్డీరేట్లను తగ్గించిన చైనా!

Published on Mon, 07/22/2024 - 12:04

ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలో ఒకటిగా ఉన్న చైనా కీలక వడ్డీరేట్లను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఆర్థిక వృద్ధిని మెరుగుపరిచేందుకు బెంచ్‌మార్క్ వడ్డీ రేట్లను 1.8% నుంచి 1.7%కు తగ్గిస్తున్నట్లు సోమవారం తెలిపింది.

చైనా ఊహించిన దాని కంటే గత వారం వెలువడిన రెండో త్రైమాసిక ఆర్థిక డేటా నిరాశజనకంగా ఉన్నా కీలక వడ్డీరేట్లలో కోతలు విధించడం గమనార్హం. చైనా ప్రభుత్వం ఐదేళ్లకు ఒకసారి ఏర్పాటు చేసే ‘ప్లీనం సమావేశం’లో భాగంగా వడ్డీ కోతలకు సంబంధించిన నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (పీబీఓసీ) ఏడు రోజుల రివర్స్ రెపో రేటును 1.8% నుంచి 1.7%కి తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. బెంచ్‌మార్క్ లెండింగ్ రేట్లను 3.45% నుంచి 3.35%కి తగ్గించింది.

చైనాలో దీర్ఘకాల ఆస్తి సంక్షోభం పెరుగుతోంది. అప్పులు అధికమవుతున్నాయి. వస్తు వినియోగం తగ్గుతోంది. చైనా ఎగుమతుల ఆధిపత్యం పెరగడంతో ఇతర ప్రపంచ దేశాలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. దాంతో చైనాలో వాణిజ్య ఉద్రిక్తతలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో వడ్డీరేట్లు తగ్గించడం విశేషం.

ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్‌.. ఏపీ, తెలంగాణకు ఏం కావాలంటే..

అమెరికాకు చెందిన ఫెడరల్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఛైర్మన్‌ జొరొమ్‌ పావెల్‌ ఇటీవల వడ్డీరేట్లును పెంచబోమని ప్రకటించారు. దాంతో అంతర్జాతీయంగా వడ్డీరేట్లు పెంపుపై కేంద్ర బ్యాంకులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తుంది. రానున్న మానిటరీ పాలసీ సమావేశాల్లో భాగంగా భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్‌బీఐ) కూడా ఈమేరకు వడ్డీరేట్లును తగ్గించే అవకాశం ఉన్నట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)