Breaking News

చైనాపై పడని మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్.. ఎందుకో తెలుసా?

Published on Sun, 07/21/2024 - 19:43

మైక్రోసాఫ్ట్‌లో ఏర్పడ్డ సమస్య ప్రపంచంలోనే చాలా దేశాలను అతలాకుతలం చేశాయి. ఇందులో భారత్ సహా అమెరికా, యూరప్ దేశాలు ఉన్నాయి. అనేక దేశాలపై పడిన ఈ మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ చైనాలో మాత్రం అంతంతమాత్రంగానే ఉండటం గమనించదగ్గ విషయం.

ప్రపంచవ్యాప్తంగా విమానాలు, ఐటీ వ్యవస్థలు, వ్యాపారాలపై ప్రభావం చూపిన మైక్రోసాఫ్ట్ అంతరాయం చైనాపై పెద్దగా ప్రభావం చూపలేదు. చైనాలోని కీలకమైన మౌలిక సదుపాయాలు, విమానయాన సంస్థలు, బ్యాంకుల కార్యకలాపాలు కూడా సజావుగా జరిగాయి. ఈ విషయాన్ని బీజింగ్‌కు చెందిన పలువురు సోషల్ మీడియా వినియోగదారులు, స్థానిక మీడియా సంస్థలు వెల్లడించాయి.

ప్రపంచంలోని చాలా దేశాలు మైక్రోసాఫ్ట్‌ను ఉపయోగిస్తున్నాయి. అయితే చైనా మాత్రం విదేశీ టెక్నాలజీల మీద ఆధారపడటాన్ని తగ్గించి, సొంత దేశ టెక్నాలజీలనే ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ కారణంగానే చైనాలో మైక్రోసాఫ్ట్‌ వినియోగం లేదు. కాబట్టి మైక్రోసాఫ్ట్ ఎఫెక్ట్ చైనా మీద పెద్దగా ప్రభావం చూపలేదు. కాబట్టి చైనాలో రోజూ జరగవలసిన కార్యకలాపాలు నిర్విరామంగా జరిగాయి.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)