వంట గది ఆహ్లాదం.. చిమ్నీ పాత్ర కీలకం

Published on Sat, 05/03/2025 - 16:13

సాక్షి, సిటీబ్యూరో: ఇంటిలో వంట గది ప్రత్యేకతే వేరు. కుటుంబ సభ్యుల ఆనందం, ఆరోగ్యంలో కిచెన్‌ కీలకమైంది. వంట ఏదైనా సరే ఘాటు వాసన, పొగ ఇళ్లంతా వ్యాపించి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. అందుకే వంట గదిలో చిమ్నీల ఏర్పాటు అనివార్యమైపోయింది. దీంతో ఇంటిలో ఘాటు వాసనలు వ్యాపించకపోవడమే కాకుండా చమురు, జిడ్డు మరకలు గోడలు మసకబారకుండా శుభ్రంగా ఉంటాయి.

చిమ్నీ రకాలు బోలెడు
వాల్‌ మౌంటెడ్‌: స్టౌ గోడకు ఆనుకొని ఉంటే వాల్‌మౌంటెడ్‌ చిమ్నీ ఏర్పాటు చేసుకోవచ్చు. వీటిని గోడలకు అమర్చడం వల్ల నేరుగా పొగ, ఘాటు వాసనలను సంగ్రహించుకోవడంలో బాగా పనిచేస్తాయి.
ఇన్‌బిల్ట్‌: కిచెన్‌ క్యాబినెట్‌ లేదా గోడలో ఇన్‌ బిల్ట్‌ చిమ్నీ కలిసిపోతుంది. ఘాటైన వాసనలు పీల్చే శక్తివంతమైన వ్యవస్థగా పనిచేస్తుంది. 
టెలిస్కోపిక్‌: ఈ రకం పైకప్పులలో ఇమిడిపోతాయి. వంట చేసేటప్పుడు చిమ్నీని పొడిగించుకోవచ్చు కూడా. చిన్న వంటగదిలో ఉపయోగపడతాయి. 
కార్నర్‌: స్థలం తక్కువగా ఉండే వంట గదిలో ఓ మూలన వినియోగిస్తారు. 
డక్ట్‌లెస్‌: గొట్టాలను అమర్చడానికి వీలులేని వంట గదిల్లో వినియోగిస్తారు. ఇవి గాలిని వెలుపలికి వదలకుండా వాటిలో ఉండే ఫిల్టర్స్‌ పొగ, ఆవిరి, చమురును పీల్చుకొని శుద్ధి చేస్తాయి. 
కన్వర్టబుల్‌: డక్టెడ్, డక్ట్‌లెస్‌ చిమ్నీలుగా మార్చుకునే అవకాశం ఉండేవే కన్వర్టబుల్‌. దీన్ని వంట గదికి అనుగుణంగా మార్చుకునే వీలుంటుంది. 
స్టాంటెండ్‌: కుక్‌టాప్‌ వద్ద వాలుగా ఉండే ఈ చిమ్నీ విలాసవంతంగా కనిపిస్తుంది. టెక్నీషియన్స్‌ ద్వారా శుభ్రం చేయించుకోవాల్సి ఉంటుంది. బయటకు కనిపించకుండా సీలింగ్‌ మౌంటెడ్‌లో అమరుస్తారు. 
ఐలాండ్‌: స్టౌ వేదిక ద్వీపంలా, కిటికీల చెంత స్టౌలు ఉంటే ఐలాండ్‌ లేదా సీలింగ్‌ మౌంటెడ్‌ చిమ్నీలను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇవి గోడల నుంచి దూరంగా ఉండటం వల్ల మరింతగా వాసనలు, పొగను సంగ్రహిస్తాయి.

Videos

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)