Breaking News

సగానికి పడిపోయిన పండుగ డిమాండ్‌

Published on Fri, 11/08/2024 - 08:16

ముంబై: ప్రస్తుత ఏడాది పండుగల సందర్భంగా డిమాండ్‌ సగానికి క్షీణించి 15 శాతంగా ఉన్నట్టు జపాన్‌ బ్రోకరేజీ సంస్థ నోమురా అంచనా వేసింది. 2023లో పండుగల సీజన్‌లో డిమాండ్‌ 32 శాతం పెరగ్గా, 2022లో 88 శాతం వృద్ధి చెందినట్టు గుర్తు చేసింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ రిటైల్‌ అమ్మకాలు పండుగల సీజన్‌లో పెరిగినప్పటికీ, మొత్తం మీద వృద్ధి నిదానంగానే ఉన్నట్టు పేర్కొంది.

గ్రామీణ ప్రాంతాలు, టైర్‌–2, 3 పట్టణాల్లో డిమాండ్‌ స్థిరంగానే ఉండగా.. మెట్రోల్లో, పారిశ్రామిక డిమాండ్‌ బలహీనంగా ఉన్నట్టు వివరించింది. పట్టణ డిమాండ్‌ బలహీనంగా ఉన్నట్టు గత నెలలో కేంద్ర ఆర్థిక శాఖ సైతం ప్రకటించడం గమనార్హం. డిసెంబర్‌ నెలలో వివాహాలు అధిక సంఖ్యలో ఉండడం డిమాండ్‌కు ఊతం ఇవ్వొచ్చని నోమురా అంచనా వేస్తోంది. రిటైల్‌ అమ్మకాల వృద్ధి 2023లో ఉన్న 36.4 శాతం నుంచి.. 2024లో 13.3 శాతానికి పరిమితం కావొచ్చన్న అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) అంచనాలను తన నివేదికలో నోమురా ప్రస్తావించింది.

మరోవైపు రిటైల్‌ ఆటో విక్రయాలు 14 శాతం పెరగ్గా.. హోల్‌సైల్‌ వైపు ప్యాసింజర్‌ అమ్మకాలు, మధ్యశ్రేణి వాణిజ్య వాహనాల అమ్మకాలు బలహీనంగా ఉన్నట్టు తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో తాత్కాలిక మందగమనం కొనసాగుతోందంటూ.. 2024–25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7.2 శాతం ఉండొచ్చన ఆర్‌బీఐ అంచనాలు మరీ ఆశావాహంగా ఉన్నట్టు నోమురా అభివర్ణించింది.  

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)