Breaking News

రూ.855 కోట్ల ఐపీవో.. సెబీకి ప్రాస్పెక్టస్‌

Published on Sun, 09/07/2025 - 07:34

న్యూఢిల్లీ: ప్రయాణ సర్వీసులందించే చార్టర్డ్‌ స్పీడ్‌ లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూ బాటలో సాగుతోంది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. దీనిలో భాగంగా రూ. 655 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 200 కోట్ల విలువైన షేర్లను కంపెనీ ప్రమోటర్లు పంకజ్‌ గాంధీ, అల్కా పంకజ్‌ గాంధీ విక్రయానికి ఉంచనున్నారు.

ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 396 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 97 కోట్లు ఎలక్ట్రిక్‌ బస్‌ల కొనుగోలుకీ వెచ్చించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు  కేటాయించనుంది. 2007లో ఏర్పాటైన అహ్మదాబాద్‌ కంపెనీ ప్రధానంగా ప్యాసింజర్‌ మొబిలిటీ సర్వీసులను అందిస్తోంది.

2025 జూన్‌30కల్లా 500 పట్టణాలలో 2,000 బస్సులతో సర్వీసులు సమకూర్చుతోంది. గత ఆర్థిక సంవత్సరం(2024–25)లో రూ. 667 కోట్ల ఆదాయం, రూ. 70 కోట్ల నికర లాభం ఆర్జించింది. అనుబంధ సంస్థల ద్వారా 945 ఎలక్ట్రిక్‌ బస్‌ల కొనుగోలుకి ఆర్డర్లు జారీ చేసింది.

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)