Breaking News

ఢిల్లీ పేలుడు: చాందిని చౌక్‌ మార్కెట్‌కు రూ.400 కోట్ల నష్టం!

Published on Thu, 11/13/2025 - 12:01

దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు ఘటన కారణంగా చాందిని చౌక్‌ మార్కెట్‌కు భారీ వ్యాపారాన్ని నష్టపోయింది. ఎర్ర కోట సమీపంలో జరిగిన ఆత్మాహుతి దాడిగా భావిస్తున్న పేలుడు ఘటనలో 12 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం జనాల తాకిడి ఒక్కసారిగా తగ్గిపోవడంతో మార్కెట్‌ వ్యాపారులు రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకూ ఆదాయాన్ని కోల్పోయినట్లు తెలుస్తోంది.

దేశంలో అతిపెద్ద హోల్ సేల్ మార్కెట్ అయిన చాందినీ చౌక్ మార్కెట్‌ నిత్యం జనాల రద్దీతో కిక్కిరిసి ఉంటుంది. రోజుకు సగటున దాదాపు నాలుగు లక్షల మంది ఈ మార్కెట్‌ను సందర్శిస్తుంటారు. ఇక్కడ ప్రతిరోజూ రూ .450 కోట్ల నుంచి రూ.500 కోట్ల విలువైన వ్యాపారం జరుగుతుందని అంచనా. అయితే, పేలుడు తర్వాత జనాల తాకిడి ఒక్కసారిగా తగ్గిపోయిందని స్థానిక వ్యాపారులు చెబుతున్నారు.

చాందినీ చౌక్ ప్రాంతంలో వ్యాపారాలు తాత్కాలికంగానే అయినా భారీగా దెబ్బతిన్నాయని స్థానిక ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ పేర్కొన్నారు. ‘ఇక్కడ వాణిజ్యం సుమారు రూ .300-400 కోట్ల నష్టాన్ని చవిచూసింది. కానీ సాధారణ పరిస్థితులు తిరిగి వచ్చి, ట్రాఫిక్ తిరిగి ప్రారంభమైన వెంటనే, కస్టమర్ల తాకిడి తిరిగి పెరుగుతుంది. మా చాందినీ చౌక్ వ్యాపారులకు స్థైర్యం ఎక్కువ’ అని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

చాందినీ చౌక్‌కు కొన్ని మీటర్ల దూరంలోనే ఎర్రకోట ట్రాఫిక్ సిగ్నల్ సమీపంలో సోమవారం సాయంత్రం ఆత్మాహుతి పేలుడు సంభవించింది. నెమ్మదిగా కదులుతున్న వాహనంలో అమర్చిన అధిక తీవ్రత కలిగిన పేలుడు పరికరం పేలింది. ఈ ఘటనలో 12 మంది మరణించారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)