Breaking News

చలికాలం ఈ భార్యాభర్తలను రూ. కోట్ల వ్యాపారవేత్తలను చేసింది

Published on Fri, 06/23/2023 - 14:06

చండీఘర్‌కు చెందిన మోహిత్ అహ్లువాలియా,  జగజ్యోత్ కౌర్ భార్యాభర్తలు. 2017 శీతాకాలంలో బాలికి  విహారయాత్ర కోసం వెళ్లారు. ఈ వెకేషన్‌ వీరికి అద్భుతమైన జ్ఞాపకాలను అందించడమే కాకుండా కొత్త ఆలోచనను రేకెత్తించింది. 

నూతన ఆశ, ఆశయాలతో ఇంటికి వెళ్లిన ఆ దంపతులు తమ ఉద్యోగాలను వదిలిపెట్టి సొంత వ్యాపారాన్ని ప్రారంభించారు. మోహిత్ అహ్లువాలియా సేల్స్ ప్రొఫెషనల్‌గా, జగజ్యోత్ కౌర్ హెచ్‌ఆర్‌ మేనేజర్‌గా పనిచేసేవారు. 

ఈ చండీగఢ్ జంట 2019లో ‘రామే’ (raamae) అనే పేరుతో గృహపయోగ, జీవనశైలి వస్తువుల వ్యాపార సంస్థను స్థాపించారు. ఇది శిక్షణ పొందిన కళాకారులు తయారు చేసిన హ్యాండ్-బ్లాక్ ప్రింటెడ్ వస్తువులైన కుషన్ కవర్లు, టోట్ బ్యాగ్‌లు, క్విల్ట్‌లు, పర్సులను విక్రయిస్తుంది. రామే అనేది బాలినీస్ పదం. బాలినీస్ ప్రజల జీవన విధానాన్ని ఇది సూచిస్తుంది. రద్దీ, అస్తవ్యస్తమైన ప్రపంచంలో నివసిస్తున్నప్పటికీ ఆనందాన్ని పొందడం దీని అర్థం.

బాలి పర్యటనతో మలుపు
‘కొన్ని సంవత్సరాల క్రితం నేను చేసిన బాలి పర్యటన నా జీవితానికి మలుపు. అక్కడ స్థానికులు చేతితో తయారు చేసిన ఉత్పత్తులకు మార్కెట్‌లో ఉన్న ఆదరణను గమనించాను. భారత్‌లోనూ హస్తకళా ఉత్పత్తులు అనేకం ఉన్నాయి. అయితే విదేశాల్లో హస్తకళా ఉత్పత్తులకు ఉన్నంత ఆదరణ భారత్‌లో ఎందుకు ఉండటం లేదో ఆశ్చర్యంగా ఉంది’ అని జగజ్యోత్ కౌర్‌ ‘షి ద పీపుల్‌’ అనే ఆన్‌లైన్‌ మ్యాగజైన్‌తో పేర్కొన్నారు. 

బ్లాక్ ప్రింటింగ్‌తో రూపొందించిన భారతీయ వస్త్రాలకు ఎంతటి ఆదరణ ఉందో బాలిలోని వీధుల్లో తిరుగుతున్నప్పుడు తెలుసుకున్నట్లు మోహిత్ ‘ది బెటర్ ఇండియా’తో చెప్పారు. డబ్బు పరంగానే కాకుండా కస్టమర్ల గౌరవం కూడా వాటికి అదే స్థాయిలో ఉందన్నారు. బాలిలో వాటికి గణనీయమైన డిమాండ్ ఉన్నప్పటికీ, ఆ ఉత్పత్తులకు భారత్‌లో ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వడం లేదని ఆయన అన్నారు.

ఇంటికి వచ్చిన తర్వాత ఈ జంట చేతివృత్తుల జీవనోపాధికి మద్దతు ఇవ్వాలని, బ్లాక్ ప్రింటింగ్‌ను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు. పదేళ్లకు పైగా ఉన్న తమ కార్పొరేట్ కెరీర్‌ను విడిచిపెట్టారు.  2018లో జైపూర్ వెళ్లి స్థానిక కళాకారుల వద్ద బ్లాక్ ప్రింటింగ్‌లో శిక్షణ తీసుకున్నారు. తర్వాత 2019లో రామే సంస్థను స్థాపించారు. ప్రస్తుతం వారు క్విల్ట్‌లు, పర్సులు, పర్సులు, పిల్లో కవర్‌లతో సహా 60 విభిన్న ఉత్పత్తులను దేశ విదేశాల్లో విక్రయిస్తున్నారు. 

రూ. 4 లక్షలతో ప్రారంభమైన ఈ సంస్థ  ఇప్పుడు ప్రతి నెలా రూ.18 లక్షలు, ఏటా రూ. 2.16 కోట్ల మేర వ్యాపారం సాగిస్తోంది. రాజస్థాన్, ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, మైసూర్, గోవా, కేరళ, ఇంఫాల్, అస్సాం, మిజోరాం ప్రాంతాల నుంచి వీరికి ఆర్డర్‌లు వస్తున్నాయి.  యూఏఈ, అమెరికా వంటి దేశాల నుంచి కూడా వీరికి కస్టమర్లు ఉన్నారు.

Videos

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)