Breaking News

‘ఆర్థికాభివృద్ధికి ఈ రెండే కీలకం’

Published on Mon, 03/17/2025 - 15:16

భవిష్యత్తులో దేశ ఆర్థిక వ్యవస్థ మరింత వృద్ధి సాధించాలంటే బలమైన ప్రైవేట్ మూలధన వ్యయం(private capital expenditure), వినియోగం పెరగాలని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్‌బీఐ) ఛైర్మన్ చల్లా శ్రీనివాసులు శెట్టి తెలిపారు. రూ.52 లక్షల కోట్లకు పైగా డిపాజిట్లున్న ఎస్‌బీఐ బ్యాంక్‌కు ఈయన ఇటీవల ఛైర్మన్‌గా ఎన్నికయ్యారు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రస్తుతం దేశ ఆర్థిక పరిస్థితులను తెలియజేస్తూ, భవిష్యత్తు వృద్ధిని అంచనా వేస్తూ వ్యాఖ్యలు చేశారు.

దేశాభివృద్ధికి ప్రస్తుతం కొన్ని రంగాల్లో ప్రైవేటు మూలధన వ్యయం జరుగుతుండగా ఉక్కు, సిమెంట్ వంటి కీలక పరిశ్రమలు పెట్టుబడులకు ముందుండాలని శెట్టి సూచించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఆర్థిక పురోగతికి ఈ రంగాలు కీలకమని చెప్పారు. ప్రస్తుత త్రైమాసిక ఆర్థిక గణాంకాలు వృద్ధికి కీలకమైన వస్తు వినియోగంలో సానుకూల ధోరణిని సూచిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: ముకేశ్‌ అంబానీ 40వ పెళ్లి రోజు.. బంగారు రంగు కేక్‌!

భారతదేశం అర్థవంతమైన పురోగతిని సాధించడానికి 8 శాతం జీడీపీ వృద్ధి రేటు అవసరమని నొక్కి చెప్పారు. ఈ ప్రతిష్టాత్మక లక్ష్యాన్ని చేరుకోవడానికి వినియోగం పెంపు, ప్రైవేట్ రంగ పెట్టుబడుల మధ్య సమన్వయం అవసరమని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ పెరుగుదలపై ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. టారిఫ్ సంబంధిత సమస్యల కారణంగా ఆర్థిక వ్యవస్థలో ప్రతికూలతలు నెలకొంటాయని భావించడంలేదని వివరించారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)