Breaking News

భారత్‌లో కార్యకలాపాల విస్తరణకు స్టెల్లార్‌

Published on Tue, 08/22/2023 - 07:26

ముంబై: థర్డ్‌ పార్టీ లాజిస్టిక్స్‌ సేవలు అందించే స్టెల్లార్‌ వేల్యూ చెయిన్‌ సొల్యూషన్స్‌లో ఫ్రాన్స్‌కు చెందిన సెవా లాజిస్టిక్స్‌ మెజారిటీ వాటాలు కొనుగోలు చేయనుంది. ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ వార్‌బర్గ్‌ పింకస్‌కు చెందిన మొత్తం వాటాలను దక్కించుకోనుంది. తద్వారా భారత్‌లో తన కార్యకలాపాలను సెవా మరింతగా విస్తరించగలదని స్టెల్లార్‌ వెల్లడించింది. అయితే డీల్‌ విలువ ఎంతనేది మాత్రం తెలపలేదు. 

లాజిస్టిక్స్‌ రంగ వెటరన్‌ అన్షుమన్‌ సింగ్‌ 2016లో స్టెల్లార్‌ వేల్యూ చెయిన్‌ను ఏర్పాటు చేశారు. డీల్‌లో భాగంగా స్టెల్లార్‌కు దేశవ్యాప్తంగా 21 నగరాల్లో 75 లక్షల చ.అ. కార్పెట్‌ ఏరియా గల 70కి పైగా గిడ్డంగులు, 8,000 మంది పైచిలుకు పూర్తి స్థాయి, తాత్కాలిక ఉద్యోగులు సెవాలో భాగమవుతారు. 

అన్షుమన్‌ సింగ్‌ యథాప్రకారం సారథ్య బాధ్యతల్లో కొనసాగుతారు సెవా లాజిస్టిక్స్‌కు భారత్‌లో ప్రస్తుతం 35 నగరాల్లో 27,00,000 చ.అ. విస్తీర్ణంలో గిడ్డంగులు ఉన్నాయి. టాప్‌ 5 గ్లోబల్‌ లాజిస్టిక్స్‌ సంస్థల్లో ఒకటిగా ఎదగాలన్న తమ లక్ష్యానికి స్టెల్లార్‌లో వాటాల కొనుగోలు ఉపయోగపడగలదని సెవా లాజిస్టిక్స్‌ సీఈవో మాథ్యూ ఫ్రైడ్‌బర్గ్‌ తెలిపారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)