Breaking News

హెలికాప్టర్‌ ప్రమాదం: ప్రముఖ బ్యాంక్‌ సీఈఓ దుర్మరణం!

Published on Sun, 02/11/2024 - 11:27

అమెరికాలోని దక్షిణ కాలిఫోర్నియాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నైజీరియాలోని అతిపెద్ద access bank సీఈఓతో సహా 9 మంది మరణించినట్లు అధికారులు చెప్పారు.  

కాలిఫోర్నియాలోని నిప్టన్ సమీపంలో రాత్రి 10 గంటల సమయంలో కూలిపోయిన సమయంలో హెలికాప్టర్‌లో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారని అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.

వారిలో access bank యాక్సెస్ బ్యాంక్ గ్రూప్ సీఈఓ హెర్బర్ట్ విగ్వే ఉన్నారని, ఆయన మరణాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థ డైరెక్టర్ జనరల్ ఎన్గోజీ ఒకోంజో ఇవెలా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు. నైజీరియన్ ఎక్స్ఛేంజ్ గ్రూప్ మాజీ చైర్మన్ అబింబోలా ఒగున్బాంజో సైతం విగ్వే మరణాన్ని ధృవీకరించారు.

ఈ సందర్భంగా.. ప్రమాద స్థలం హాలోరాన్ స్ప్రింగ్స్ రోడ్డు సమీపంలోని 15-ఫ్రీవేకు తూర్పున ఉందని నిర్ధారించామని శాన్ బెర్నార్డినో కౌంటీ షెరీఫ్ డిపార్ట్మెంట్ అధికారులు వెల్లడించారు. ఈ హెలికాప్టర్‌ను యూరోకాప్టర్ ఈసీ 130గా గుర్తించిన ఎఫ్ ఏఏ.. నేషనల్ ట్రాన్స్ పోర్టేషన్ సేఫ్టీ బోర్డుతో కలిసి దర్యాప్తు చేస్తామని చెప్పారు. కాగా, లాస్ వెగాస్కు వెళ్తుండగా నెవాడా- కాలిఫోర్నియా సరిహద్దు నగరం సమీపంలో హెలికాప్టర్ కూలిపోయింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)