Breaking News

గోధుమ ధరల పెరుగుదలకు చెక్‌!

Published on Sun, 09/15/2024 - 01:09

న్యూఢిల్లీ: గోధుమల ధరల పెరుగుదలకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. ట్రేడర్లు, హోల్‌సేల్‌ వర్తకులు, బడా రిటైల్‌ మాల్స్‌ నిర్వాహకులకు గోధుల నిల్వలపై పరిమితులను కఠినతరం చేసింది. జూన్‌ 24న విధించిన నిల్వ పరిమితులను సవరించింది. ట్రేడర్లు, టోకు వర్తకులు 2,000 టన్నుల వరకే నిల్వ చేసుకోగలరు. ఇప్పటి వరకు ఇది 3,000 టన్నులుగా ఉంది.

3 బడా రిటైల్‌ చైన్‌లు ప్రతి ఔట్‌లెట్‌ (స్టోర్‌)లో 10 మెట్రిక్‌ టన్నుల వరకే గోధుమల నిల్వలకు పరిమితం కావాల్సి ఉంటుంది. డిపోలో స్టోర్‌ సంఖ్యకు 10 రెట్లకు మించి ఉండరాదు. గతంలో స్టోర్‌వారీ పరిమితుల్లేవు. అదే గోధుమ ప్రాసెసర్లు అయితే నెలవారీ స్థాపిత సామర్థ్యంలో ఇప్పటి వరకు 70 శాతం వరకు నిల్వలు కలిగి ఉండేందుకు అవకాశం ఉంటే, దీనిని 60 శాతానికి తగ్గించింది. విడిగా రిటైల్‌ స్టోర్లు అయితే 10 టన్నుల గోధుమలు నిల్వ చేసుకోవచ్చు. 2025 మార్చి 31 వరకు ఈ నిబంధనలు అమల్లో ఉంటాయని కేంద్రం ప్రకటించింది.  

ఉల్లిగడ్డలు, బాస్మతీ ఎగుమతులపై ఆంక్షల తొలగింపు 
ఉల్లిగడ్డలు, బాస్మతీ బియ్యం ఎగుమతులకు సంబంధించి కనీస ఎగుమతి ధర (ఎంఈపీ)లను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. కీలకమైన హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల ముందు ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మహారాష్ట్ర రైతులు ఎక్కువగా ఉల్లిని ఎగుమతి చేస్తుంటారు. హర్యానా, పంజాబ్‌లో బాస్మతీ సాగు ఎక్కువగా జరుగుతుంటుంది. బాస్మరీ బియ్యం ఎగుమతికి టన్నుకు కనీసం 950 డాలర్ల ధర పరిమితిని తొలగించింది. అలాగే, టన్ను ఉల్లిగడ్డలపై 550 డాలర్లుగా ఉన్న కనీస ఎగుమతి ధరను కూడా తొలగించినట్టు డైరెక్టరేట్‌ నరల్‌ ఆఫ్‌ ఫారీన్‌ ట్రేడ్‌ ప్రకటించింది. ఈ నిర్ణయం ఎగుమతుల వృద్దికి, రైతుల ఆదాయం మెరుగుపడేందుకు దారితీస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్‌ గోయల్‌ అన్నారు.   
 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)