Breaking News

ఇన్సూరెన్స్ ప్రీమియంల మోత.. నో లాజిక్‌!

Published on Tue, 03/17/2026 - 13:18

ఆరోగ్య బీమా ప్రీమియంల పెంపుపై బీమా కంపెనీలు చెబుతున్న వాదనలకు, వాస్తవాలకు పొంతన లేదని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా స్పష్టం చేసింది. వైద్య ఖర్చుల పెరుగుదల (మెడికల్ ఇన్‌ఫ్లేషన్) కారణంగానే ప్రీమియంలు పెంచుతున్నామన్న కంపెనీల వాదనను బలపరిచేలా ఎలాంటి అధికారిక అధ్యయనాలు లేవని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభకు వెల్లడించారు. గత కొన్నేళ్లుగా సామాన్యులపై భారంగా మారిన హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల వ్యవహారంపై కేంద్రం చేసిన ఈ ప్రకటన ఇప్పుడు చర్చనీయాంశమైంది.

అధ్యయనం లేదు.. ఆధారాల్లేవు!

బీమా రంగ నియంత్రణ సంస్థ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఐఆర్‌డీఏఐ) వద్ద దీనిపై నిర్దిష్టమైన డేటా లేదని మంత్రి తెలిపారు. మెడికల్ ఇన్‌ఫ్లేషన్ రేటుకు, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంల పెంపునకు మధ్య గల సంబంధంపై ఐఆర్‌డీఏఐ ఎటువంటి ప్రత్యేక అధ్యయనం నిర్వహించలేదు.

కేవలం వైద్య ఖర్చులే కాకుండా పాలసీదారుల సగటు వయసు పెరగడం, క్లెయిమ్ హిస్టరీ, మెరుగైన పాలసీ ఫీచర్లు వంటి అనేక అంశాలు ప్రీమియం పెంపులో కీలక పాత్ర పోషిస్తాయి. ఈ నేపథ్యంలో కేవలం వైద్య ద్రవ్యోల్బణం వల్ల మాత్రమే ఎంత శాతం ప్రీమియం పెరిగిందో విడదీసి చూడటం సాధ్యం కాదని మంత్రి వివరించారు.

కంపెనీల వాదన.. వాస్తవ పరిస్థితి

సాధారణంగా బీమా కంపెనీలు దేశంలో మెడికల్ ఇన్‌ఫ్లేషన్ 12-14 శాతం మధ్య ఉందని, ఇది సాధారణ ద్రవ్యోల్బణం కంటే రెట్టింపు అని వాదిస్తుంటాయి. కరోనా అనంతర కాలంలో కొన్ని కంపెనీలు తమ ప్రీమియంలను ఏకంగా 100 శాతం వరకు పెంచేశాయి. కొన్ని కంపెనీలు గత ఏడాది తమ 65 శాతం ఉత్పత్తుల ధరలను పెంచడానికి వైద్య ఖర్చులే కారణమని పేర్కొన్నాయి. అయితే ప్రభుత్వం తాజా వివరణతో కంపెనీల ‘ద్రవ్యోల్బణ సాకు’ బలహీనపడింది.

బీమా కంపెనీలు తమ లాభాలను పెంచుకోవడానికి వైద్య ఖర్చులను సాకుగా చూపిస్తున్నాయనే ఆరోపణలకు కేంద్ర మంత్రి సమాధానం బలాన్ని చేకూర్చింది. పారదర్శకత లేని ప్రీమియం పెంపుదలపై వినియోగదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో ఐఆర్‌డీఏఐ మరింత పకడ్బందీగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కొందరు చెబుతున్నారు.

Videos

ప్రజా దర్బార్ లో పేదలను అవమానించిన బద్వేల్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ

103 డాలర్లకు చమురు ధర

దొంగచాటుగా హర్ముజ్ జలసంధిని దాటుతున్న నౌకలు

కూటమి తీరుపై రాష్ట్రవ్యాప్తంగా వైస్సార్సీపీ భారీ నిరసన

సీపీ సతీమణి ఏకే 47 గన్ తో 10 రౌండ్ల కాల్పులు

శత్రుల రాడార్లను ముప్పు తిప్పలు పెట్టె ఇరాన్ మిస్సైల్

Sec-Bad: 800 కిలోల కుళ్లిన చికెన్

ఎమ్మెల్యేల కథ దేవుడెరుగు.. BR నాయుడు రాసలీలలపై జగన్ సెటైర్లు

ఇది కదా తండ్రి ప్రేమంటే కొడుకు పరీక్ష కోసం ఏం చేశాడంటే

లాగి చెంపకేసి ఒక్కటి పీకాల్సింది పోయి... ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసుపై జగన్ స్టాంగ్ రియాక్షన్

Photos

+5

నటి మంచు లక్ష‍్మి ఇంట్లో శుభకార్యం (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో ఇప్పుడు అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫోటోలు)

+5

తమ్ముడి పిల్లల బర్త్‌డే వేడుకల్లో మహేశ్‌ బాబు (ఫోటోలు)

+5

ఆస్కార్‌ వేడుకలో మెరిసిన వారణాసి బ్యూటీ ప్రియాంక చోప్రా.. (ఫోటోలు)

+5

రష్మిక-విజయ్ దేవరకొండ హల్దీ వేడుక.. (ఫొటోలు)

+5

‘ఉస్తాద్‌ భగత్‌సింగ్‌’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఘనంగా నమన్‌ అవార్డుల ప్రదానోత్సవం.. మెరిసిన భారత క్రికెటర్లు (ఫోటోలు)

+5

OSCARS 2026 : ఆస్కార్‌ విజేతల జాబితా (ఫోటోలు)

+5

ఘనంగా కుల్దీప్ యాదవ్ పెళ్లి (ఫోటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (మార్చి 15- 22)