Breaking News

జీఎస్టీ స్లాబ్‌ల తగ్గింపునకు కేంద్రం అడుగులు!

Published on Fri, 08/15/2025 - 19:41

దేశవ్యాప్తంగా అమలులో ఉన్న గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్టీ) పన్ను నిర్మాణాన్ని మరింత సరళీకరించే పనిని కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. ఈ మేరకు కీలక ప్రతిపాదనలు రూపొందించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అమలులో ఉన్న నాలుగు ప్రధాన స్లాబ్‌లను కుదించి రెండు ప్రధాన స్లాబ్‌లుగా మారుస్తోంది. తాజా ప్రతిపాదనల ప్రకారం.. 12 శాతం, 28 శాతం, స్లాబ్‌లను రద్దు చేసి 5 శాతం, 18 శాతం మాత్రమే కొనసాగించాలన్న ఆలోచనను కేంద్ర ఆర్థిక శాఖ ముందుంచినట్లు సమాచారం.

నూతన ప్రతిపాదనల ప్రకారం.. 28 శాతం స్లాబ్‌ పరిధిలోని 90 శాతం వస్తువులను 18 శాతం పరిధిలోకి, అలాగే 12 శాతం స్లాబ్‌ పరిధిలోని 99 శాతం వస్తువులను 5 శాతం కిందికి తీసుకురానున్నారు. ప్రస్తుతం 12 శాతం స్లాబ్‌లో ఉన్న టూత్‌పేస్ట్, మొబైల్ ఫోన్లు, ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు, బట్టలు, బూట్లు వంటి మధ్యస్థాయి వినియోగ వస్తువులను 5 శాతం స్లాబ్‌లోకి మార్చే యోచన ఉంది. ఇదే సమయంలో, 28 శాతం స్లాబ్‌లో ఉన్న కార్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, కొన్ని సేవలను 18 శాతం స్లాబ్‌లోకి తరలించనున్నారు.

ప్రత్యేకంగా 40 శాతం స్లాబ్‌ 
జీఎస్టీ పన్ను నిర్మాణంలో ప్రధానంగా రెండు స్లాబ్‌లే కొనసాగనున్నప్పటికీ కొన్ని హానికరమైన వస్తువుల కోసం ప్రత్యేకంగా 40 శాతం స్లాబ్‌ను ప్రతిపాదించినట్లుగా తెలుస్తోంది. ఈ స్లాబ్‌లో తంబాకు, గుట్కా, సిగరెట్లు వంటి కేవలం 5–7 వస్తువులే ఉండే అవకాశం ఉంది.

ఈ మార్పుల వల్ల  నిత్యావసర వస్తువులపై పన్ను భారం తగ్గి, వినియోగదారులకు ఉపశమనం కలగనుంది. ముఖ్యంగా మధ్యతరగతి, పేదవర్గాలపై నెలవారీ ఖర్చుల ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. కేంద్రం అంచనా ప్రకారం, ఈ స్లాబ్ మార్పుల వల్ల రూ. 40,000 కోట్ల నుంచి రూ. 50,000 కోట్ల వరకు రెవెన్యూ నష్టం జరగవచ్చని భావిస్తున్నప్పటికీ, వినియోగం పెరిగి, పన్ను ఆదాయం తిరిగి స్థిరపడే అవకాశం ఉందని అధికారులు విశ్వసిస్తున్నారు. అయితే పెట్రోలియం ఉత్పత్తులు ఇప్పటికీ జీఎస్టీ పరిధిలోకి లేవు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ జీఎస్టీ మార్పులను "డబుల్ దీపావళి గిఫ్ట్"గా ప్రజలకు ప్రకటించారు. పన్ను వ్యవస్థను సరళీకరించడం ద్వారా ప్రజలపై పన్ను భారం తగ్గించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై చర్చ జరగనుంది. జూలై చివరి వారంలో లేదా ఆగస్టు మొదటి వారంలో ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి