‍ప్రభుత్వ స్కీమ్‌లు.. ఒకటి పొడిగింపు.. మరొకటి పునఃప్రారంభం

Published on Sun, 08/10/2025 - 08:19

ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన పీఎం ఈ–డ్రైవ్‌ స్కీమును కొన్ని వాహన విభాగాలకు రెండేళ్ల పాటు 2028 మార్చి వరకు పొడిగిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. ఎలక్ట్రిక్‌ బస్సులు, ఈ–అంబులెన్స్‌లు, ఈ–ట్రక్కులు వీటిలో ఉన్నాయి. వాస్తవానికి ఈ స్కీము గడువు 2026 మార్చితో ముగియాల్సి ఉంది.

ఈ స్కీము పరిమాణం రూ. 10,900 కోట్లకు మాత్రమే పరిమితమవుతుందని, ఒకవేళ గడువు లోగా నిధులు పూర్తిగా వినియోగించేసిన పక్షంలో.. సంబంధిత సెగ్మెంట్లు లేదా స్కీము కూడా ముగిసిపోతుందని కేంద్రం వివరించింది. మరోవైపు, రిజిస్టర్డ్‌ ఈ–టూవీలర్లు, ఈ–రిక్షాలు, ఈ–కార్టులు, ఈ–త్రీ వీలర్లకు ఆఖరు తేదీ యథాప్రకారంగా 2026 మార్చి 31గా ఉంటుందని పేర్కొంది. 

టెక్స్‌టైల్స్‌ పీఎల్‌ఐ స్కీము పోర్టల్‌ పునఃప్రారంభం 
పరిశ్రమ వర్గాల విజ్ఞప్తి మేరకు టెక్స్‌టైల్స్‌ రంగానికి సంబంధించిన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) స్కీము పోర్టల్‌ను మళ్లీ తెరిచినట్లు కేంద్రం వెల్లడించింది. ఆగస్టు 31 వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఇది అందుబాటులో ఉంటుందని వివరించింది. గతంలో నిర్దేశించిన మార్గదర్శకాలే కొత్త దరఖాస్తులకు కూడా వర్తిస్తాయి. ఆసక్తి గల కంపెనీలన్నీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని టెక్స్‌టైల్స్‌ శాఖ సూచించింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)