Breaking News

కేంద్రం కీలక ప్రకటన.. 16 రకాల మందులు బ్యాన్!

Published on Sat, 06/20/2026 - 15:48

ప్రజల ఆరోగ్య భద్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం 16 ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (FDC) మందుల తయారీ, విక్రయం, పంపిణీపై దేశవ్యాప్తంగా నిషేధం విధించింది. ఈ మందులకు సరైన వైద్యపరమైన ఆధారాలు లేకపోవడంతో పాటు, వాటి వల్ల కలిగే ప్రయోజనాల కంటే.. ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణుల కమిటీ తేల్చడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

ఫిక్స్‌డ్ డోస్ కాంబినేషన్ (FDC) మందులు అంటే.. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఔషధ పదార్థాలను ఒకే మాత్ర లేదా ఔషధ రూపంలో నిర్దిష్ట నిష్పత్తిలో కలిపి తయారు చేసేవి. కొన్ని సందర్భాల్లో ఇవి రోగులకు సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ, ఆరోగ్యానికి హానికరంగా మారే అవకాశం ఉంటుంది.

ఈ అంశంపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు.. డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (DTAB) నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ వివిధ ఔషధ కలయికలను సమీక్షించి, వైద్యపరంగా సమర్థించలేని, చికిత్సాపరంగా ప్రయోజనం లేని లేదా హానికరంగా మారే అవకాశమున్న మందులను గుర్తించింది.

కంపెనీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940లోని సెక్షన్ 26A కింద నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో గుర్తించిన 16 రకాల ఎఫ్‌డీసీ మందుల తయారీ, విక్రయం, పంపిణీ, సరఫరాను దేశవ్యాప్తంగా వెంటనే బ్యాన్ చేసింది.

కేంద్రం నిషేదించిన మందుల జాబితాలో యాంటీబయాటిక్ మిశ్రమాలు, నొప్పి నివారణ ఫార్ములేషన్లు, యాంటిస్పాస్మోడిక్ మందులు, కొన్ని చర్మ సంబంధిత తయారీలు ఉన్నాయి.

ఎసిటైల్ సాలిసిలిక్ యాసిడ్ విత్ ఇథోహెప్టాజైన్; డైసైక్లోమైన్, పారాసెటమాల్ అండ్ క్లిడినియం బ్రోమైడ్; డైసైక్లోమైన్, పారాసెటమాల్, క్లిడినియం బ్రోమైడ్ అండ్ క్లోర్డియాజెపాక్సైడ్; గ్లిక్లాజైడ్ అండ్ క్రోమియం పికోలినేట్; అండ్ పారాసెటమాల్ అండ్ లిగ్నోకైన్ వంటి కాంబినేషన్లు నిషేధానికి గురయ్యాయి.

అమోక్సిసిలిన్‌ విత్ సెరాటియోపెప్టిడేస్, అమోక్సిసిలిన్‌ విత్ సెరాటియోపెప్టిడేస్ అండ్ లాక్టోబాసిల్లస్ స్పోరోజెనెస్, అమోక్సిసిలిన్‌ విత్ క్లోక్సాసిలిన్, లాక్టిక్ యాసిడ్ బాసిల్లస్ అండ్ సెరాటియోపెప్టిడేస్, సెఫాడ్రాక్సిల్‌తో ప్రోబెనెసిడ్, అండ్ సెఫ్యూరాక్సిమ్‌ విత్ సెరాటియోపెప్టిడేస్ వంటి యాంటీబయాటిక్స్‌ను కూడా నిషేధించారు. వీటికి తగిన చికిత్సా ప్రయోజనం లేదని నిపుణులు అభిప్రాయపడ్డారు.

చర్మ సంరక్షణ ఉత్పత్తుల విభాగంలో.. అలోవేరా లేదా అలోవేరా ఎక్స్‌ట్రాక్, విటమిన్ ఈ, జోజోబా ఆయిల్, ఆరంజ్ ఆయిల్, వీట్ జెర్మ్ ఆయిల్, టీ ట్రీ ఆయిల్, అల్లంటోయిన్, డి-పాంథెనాల్ వంటివి ఉన్నాయి.

సురక్షితమైన మందులను ప్రజలకు అందుబాటులో ఉండేలా చేయడానికి కేంద్రప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా ఇలాంటి ఎఫ్‌డీసీ మందులను ప్రభుత్వం నిషేధించింది. రాష్ట్ర ఔషధ నియంత్రణ అధికారులు, నియంత్రణ సంస్థలు, అమలు విభాగాలు ఈ నిషేధాన్ని కఠినంగా అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. అలాగే తయారీదారులు, దిగుమతిదారులు, పంపిణీదారులు, ఇతర సంబంధిత సంస్థలు చట్టానికి అనుగుణంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.

#

Tags : 1

Videos

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)