చిన్న మార్పు.. ఆ రైల్వేకు అధిక ఆదాయం తెచ్చిపెడుతోంది..

Published on Fri, 07/07/2023 - 16:40

సెంట్రల్ రైల్వే పరిధిలోని ఓ రైల్వే డివిజన్ చేసిన మార్పు అధిక ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది. వివిధ మార్గాల్లో ఆదాయ పెంపుపై దృష్టి పెట్టిన సెంట్రల్ రైల్వే పరిధిలోని ముంబై డివిజన్ తమ పరిధిలోని ప్రకటన హోర్డింగ్‌లను డిజిటల్ బిల్‌బోర్డ్‌లుగా మార్చడం ప్రారంభించింది. మొత్తం ఏడు హోర్డింగ్‌లను ఎల్‌ఈడీ డిస్‌ప్లే, డిజిటల్ బిల్‌బోర్డ్‌లుగా మార్చింది. దీంతో వార్షిక లైసెన్సు ఫీజులు గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు.

డిజిటల్ బిల్‌బోర్డ్‌లుగా మార్చిన ఈ హోర్డింగ్‌ల ద్వారా సంవత్సరానికి రూ.1.53 కోట్ల అదనపు ఆదాయం ముంబై రైల్వే డివిజన్‌కు వచ్చింది. కుర్లా రోడ్ ఓవర్ బ్రిడ్జ్ తూర్పు వైపు, సియోన్ ఆర్‌ఓబీ (రెండు బోర్డులు), కంజుర్‌మార్గ్ రోడ్ ఆర్‌ఓబీ, తిలక్ నగర్ రోడ్ ఓవర్ బ్రిడ్జ్, సుమన్ నగర్ ఆర్‌యూబీ గాంట్రీ సైట్ సీ, థానే-కోప్రి ఆర్‌ఓబీ వద్ద ఈ డిజిటల్‌ ప్రకటన బోర్డులు ఉన్నాయి.

ప్రకటనదారులు సాధారణ లైసెన్స్ రుసుము కంటే 1.5 రెట్లు అధికంగా చెల్లించి ఇప్పటికే ఉన్న స్టాటిక్ హోర్డింగ్‌లను ఆకర్షణీయమైన డిజిటల్ డిస్‌ప్లే బోర్డులుగా మార్చుకోవచ్చు. కాగా మరో నాలుగు హోర్డింగ్‌లను డిజిటల్ బిల్‌బోర్డ్‌లుగా మార్చే ప్రక్రియలో ముంబై రైల్వే డివిజన్ ఉంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)