Breaking News

ఇంత జీఎస్టీ ఎగ్గొట్టారా?

Published on Mon, 08/04/2025 - 17:02

గడిచిన ఐదేళ్లలో (2024-25 ఆర్థిక సంవత్సరం వరకు) సుమారు రూ.7.08 లక్షల కోట్ల పన్ను ఎగవేతను కేంద్ర జీఎస్టీ ఫీల్డ్ ఆఫీసర్లు గుర్తించారు. ఇందులో సుమారు రూ.1.79 లక్షల కోట్ల ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ మోసం కూడా ఉందని కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా  పార్లమెంటుకు తెలిపింది.

లోక్‌సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక్క 2024-25 ఆర్థిక సంవత్సరంలోనే రూ.2.23 లక్షల కోట్లకు పైగా  జీఎస్టీ ఎగవేతను సీజీఎస్టీ ఫీల్డ్ ఆఫీసర్లు గుర్తించారు. గత ఐదేళ్లలో గుర్తించిన మొత్తం 91,370 కేసుల్లో జీఎస్టీ ఎగవేత సుమారు రూ.7.08 లక్షల కోట్లుగా ఉంది. ఈ కాలంలో స్వచ్ఛంద డిపాజిట్ ద్వారా వసూలు చేసిన పన్నులు రూ.1.29 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి.

2021 ఆర్థిక సంవత్సరం నుంచి 2025 ఆర్థిక సంవత్సరం మధ్య 44,938 కేసుల్లో సుమారు రూ.1.79 లక్షల కోట్ల ఐటీసీ మోసం జరిగింది. 2022, 2021 ఆర్థిక సంవత్సరాల్లో జీఎస్టీ ఎగవేతలు వరుసగా రూ.73,238 కోట్లు, రూ.49,384 కోట్లుగా ఉన్నాయి. ఇందులో ఐటీసీ మోసాలు వరుసగా రూ.28,022 కోట్లు, రూ.31,233 కోట్లు ఉన్నాయి. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.30 లక్షల కోట్ల విలువైన జీఎస్టీ ఎగవేతను సీజీఎస్టీ ఫీల్డ్ ఆఫీసర్లు గుర్తించారు.

2023 ఆర్థిక సంవత్సరంలో రూ.1.32 లక్షల కోట్ల జీఎస్టీ ఎగవేతను గుర్తించామని, ఇందులో రూ.24,140 కోట్ల నకిలీ ఐటీసీ క్లెయిమ్‌లు ఉన్నాయని తెలిపారు.  2025 ఆర్థిక సంవత్సరంలో గుర్తించిన 30,056 జీఎస్టీ ఎగవేత కేసులలో సగానికి పైగా లేదా 15,283 కేసులు ఐటీసీ మోసానికి సంబంధించినవి. వీటి ద్వారా రూ .58,772 కోట్ల ఎగవేత జరిగింది.

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు