Breaking News

రీసైక్లింగ్‌ పరిశ్రమల అభివృద్ధిపై కేంద్రం దృష్టి

Published on Tue, 06/20/2023 - 08:47

కోల్‌కతా: తయారీ సంస్థలకు మరిన్ని బాధ్యతలు కట్టబెట్టడం (ఈపీఆర్‌) వంటి విధానపరమైన చర్యల ద్వారా రీసైక్లింగ్‌ను మరింతగా ప్రోత్సహించాలని కేంద్రం యోచిస్తోంది. తద్వారా వ్యర్ధాలను కనిష్ట స్థాయికి తగ్గించవచ్చని, పునర్వినియోగాన్ని పెంపొందించవచ్చని భావిస్తోంది. కేంద్ర గనుల శాఖ సంయుక్త కార్యదర్శి ఉపేంద్ర సి జోషి ఈ విషయాలు తెలిపారు. ఈపీఆర్‌ విధానం కింద వాడేసిన ఉత్పత్తుల సేకరణకు నిధులు సమకూర్చడం, రీసైక్లింగ్‌ ఖర్చులను భరించడం తద్వారా పర్యావరణంపై ప్రభావాలను తగ్గించడం వంటి వాటికి తయారీ సంస్థలు బాధ్యత వహించాల్సి ఉంటుంది. 

దీనివల్ల రీసైక్లింగ్‌ పరిశ్రమకు తోడ్పాటు లభిస్తుంది. అధునాతన సాంకేతికత తోడ్పాటుతో వనరుల వినియోగ సామర్థ్యాలను పెంచుకునేలా పరిశ్రమను అభివృద్ధి చేయాలని కేంద్రం భావిస్తోందని జోషి చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈపీఆర్‌ వంటి విధానపరమైన చర్యలను పరిశీలిస్తోందని వివరించారు. మరోవైపు మెటల్‌ స్క్రాప్‌పై ప్రస్తుతం 18 శాతంగా ఉన్న జీఎస్‌టీని 5 శాతానికి తగ్గించాలని మెటీరియల్‌ రీసైక్లింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎంఆర్‌ఏఐ) సీనియర్‌ వైస్‌–ప్రెసిడెంట్‌ ధవళ్‌ షా కేంద్రాన్ని కోరారు. 2030 నాటికి 30 కోట్ల టన్నుల ఉక్కు ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించేందుకు రీసైక్లింగ్‌ రంగంలో పెట్టుబడులు వచ్చేలా ఆకర్షణీయమైన పాలసీలను అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశీయంగా ఉక్కు ఉత్పత్తిలో రీసైకిల్‌ చేసిన స్టీల్‌ వాటా 22 శాతంగా ఉంటుంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)