Breaking News

ఎస్‌బీఐ ఛైర్మన్‌ నియామకానికి కేంద్రం ఆమోదం

Published on Wed, 08/07/2024 - 08:25

ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కొత్త చైర్మన్‌గా చల్లా శ్రీనివాసులు శెట్టి (సీఎస్‌ శెట్టి) నియామకానికి కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించి ఆర్థిక సేవల విభాగం పంపిన ప్రతిపాదనకు నియామకాల క్యాబినెట్‌ కమిటీ (ఏసీసీ) ఆమోదముద్ర వేసినట్లు అధికారిక ప్రకటనలో వెల్లడైంది.

ప్రస్తుతం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న దినేశ్‌ కుమార్‌ ఖారా ఆగస్టు 28న పదవీ విరమణ చేయనున్నారు. అనంతరం ఆయన స్థానంలో శెట్టి బాధ్యతలు స్వీకరిస్తారు. ఆయన పదవీకాలం మూడేళ్లు ఉంటుంది. తెలంగాణలోని జోగులాంబ గద్వాల్‌ జిల్లాకు చెందిన శెట్టి ప్రస్తుతం ఎస్‌బీఐ మేనేజింగ్‌ డైరెక్టర్లలో అత్యంత సీనియర్‌గా ఉన్నారు. బీఎస్సీ చేసిన ఆయన 1988లో ప్రొబేషనరీ ఆఫీసరుగా ఎస్‌బీఐలో తన కెరియర్‌ ప్రారంభించారు. మరోవైపు, ప్రస్తుతం డీఎండీగా ఉన్న రాణా అశుతోష్‌ కుమార్‌ సింగ్‌ను ఎస్‌బీఐ ఎండీగా  కేంద్రం నియమించింది. ఎస్‌బీఐలో ఒక ఛైర్మన్, నలుగురు ఎండీలు ఉంటారు.

ఇదీ చదవండి: పండగ సీజన్‌లో శనగపప్పు ధరలకు రెక్కలు

#

Tags : 1

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)