అంబటి రాంబాబు దీక్ష వద్ద జడ శ్రావణ్ స్పీచ్
Breaking News
డీఏ పెంపు.. కేంద్ర ఉద్యోగులకు ఇక మరింత జీతం
Published on Sat, 04/18/2026 - 19:24
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల నిరీక్షణకు తెరపడింది. ప్రభుత్వ ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (DA)ను 2 శాతం పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. తాజా పెంపుతో డీఏ ప్రస్తుతం ఉన్న 58 శాతం నుండి 60 శాతానికి చేరుకుంది.
గత అక్టోబర్‌లో ప్రభుత్వం డీఏను 55% నుండి 58 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే. ఆ నిర్ణయం జూలై 1, 2025 నుండి అమలులోకి వచ్చింది. ఇప్పుడు ప్రకటించిన అదనపు 2 శాతం పెంపుతో కోటి మందికి పైగా ఉద్యోగులు, పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది.
జీతం ఎంత పెరుగుతుందంటే?
ఈ పెంపు వల్ల నెలవారీ వేతనంలో మార్పులను ఒక ఉదాహరణ ద్వారా పరిశీలిస్తే.. ఒక ఉద్యోగి ప్రాథమిక వేతనం (Basic Pay) రూ.50,000 అనుకుందాం. పాత రేటు (58%) ప్రకారం డీఏ రూ.29,000. కొత్త రేటు (60%) ప్రకారం డీఏ రూ.30,000. అంటే, ప్రతి నెలా నేరుగా రూ.1,000 అదనంగా లభిస్తుంది. దీనితో పాటు జనవరి నుండి రావాల్సిన బకాయిలు (Arrears) కూడా ఉద్యోగుల ఖాతాల్లో జమ అవుతాయి.
8వ వేతన సంఘానికి డిమాండ్లు
ఒకవైపు డీఏ పెరుగుతున్నప్పటికీ, ఉద్యోగ సంఘాలు 8వ వేతన సంఘం (8th Pay Commission) ఏర్పాటుపై ఒత్తిడి పెంచుతున్నాయి. నేషనల్ కౌన్సిల్-జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ 3.83 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను డిమాండ్ చేస్తోంది. ఇదే గనుక అమలైతే కనీస వేతనం రూ.18,000 నుండి ఏకంగా రూ.69,000కు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుత డీఏ పెంపు వల్ల సుమారు 1.19 కోట్ల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం చేకూరనుంది.
Tags : 1