Breaking News

వృద్ధి 6.8 శాతానికి చేరుకోవచ్చు

Published on Sat, 11/08/2025 - 04:29

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 6.8 శాతంగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ పేర్కొన్నారు. జీఎస్‌టీ రేట్ల కోత, ఆదాయపన్ను మినహాయింపులతో పెరిగే వినియోగం వృద్ధికి ఊతమిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘‘ప్రస్తుతం 6.8 శాతం వృద్ధి రేటు విషయంలో సౌకర్యంగా ఉన్నాను. 

వాస్తవానికి 2025–26 సంవత్సరానికి సంబంధించి నా అంచనా 6.3–6.8 శాతం (ఆర్థిక సర్వే ప్రకారం). కనీసం 6–7 శాతం శ్రేణిలో కనిష్ట స్థాయికి వెళతామేమోనన్న ఆందోళన ఆగస్ట్‌లో వ్యక్తమైంది. ఇప్పుడు ఇది 6.5 శాతం, అంతకుమించి 6.8 శాతానికి కూడా చేరుకోవచ్చని సౌకర్యంగా చెబుతున్నాను. 7 శాతం వృద్ధి రేటు అంచనాలను వ్యక్తీకరించాలంటే, రెండో త్రైమాసికం జీడీపీ గణాంకాలు వచ్చే వరకు ఆగాల్సిందే’’అని నాగేశ్వరన్‌ ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు.

 2025–26 జూన్‌ త్రైమాసికంలో జీడీపీ 7.8 శాతం వృద్ధి రేటును నమోదు చేయడం తెలిసిందే. దీనికంటే ముందు 2024 జనవరి–మార్చి త్రైమాసికంలో 8.4 శాతం స్థాయిలో జీడీపీ వృద్ధి నమోదైంది. ప్రపంచంలో వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తున్న దేశంగా భారత్‌ మొదటి స్థానంలో ఉండగా, 5.2 శాతంతో చైనా రెండో స్థానంలో ఉంది.  

అమెరికాతో ఒప్పందం సానుకూలం 
అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదిరితే దేశ వృద్ధి రేటు మరింత వేగాన్ని అందుకుంటుందని నాగేశ్వరన్‌ అభిప్రాయపడ్డారు. త్వరలోనే ఈ ఒప్పందం సాకారం అవుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. వాణిజ్య ఒప్పందం విషయంలో పరిష్కారం పట్ల ఇప్పటికీ సానుకూలంగా ఉన్నట్టు చెప్పారు. భారత ఉత్పత్తులపై అమెరికా 50 శాతం టారిఫ్‌లు అమలు చేస్తుండడం తెలిసిందే. నవంబర్‌ నాటికి తొలి దశ ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునే దిశగా రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతుండడం గమనార్హం.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)