Breaking News

యాపిల్.. ఓలా.. ఉబర్‌లకు సీసీపీఏ నోటీసులు

Published on Fri, 01/24/2025 - 14:18

సాఫ్ట్‌వేర్‌ పనితీరు, ధరల వ్యత్యాసాలపై వినియోగదారుల ఫిర్యాదుల నేపథ్యంలో టెక్ దిగ్గజం యాపిల్ ఇంక్, ఆన్‌లైన్‌ క్యాబ్ సర్వీస్‌ సంస్థలు ఓలా, ఉబర్‌కు సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ (CCPA) నోటీసులు జారీ చేసింది. వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. వినియోగదారులపై దోపిడీని ప్రభుత్వం సహించబోదని మంత్రి తెలిపారు.

యాపిల్‌పై ఆరోపణలు..

యాపిల్ తాజా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ ఐఓఎస్ 18.2.1తో  ఐఫోన్ యూజర్లు సమస్యలు ఎదుర్కొంటున్నట్లు ఫిర్యాదు చేశారు. లోకల్ సర్కిల్స్ నిర్వహించిన ఒక సర్వే ప్రకారం ఐఫోన్ వినియోగదారుల్లో 60% మంది లేటెస్ట్‌ సాఫ్ట్‌వేర్‌తో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఇందులో కాల్ వైఫల్యాలు అత్యంత సాధారణ సమస్యగా ఉన్నాయి. బగ్స్, భద్రతా పరమైన సమస్యలను పరిష్కరించడానికి ఉద్దేశించిన ఐఓఎస్ 18.0.1, ఐఓఎస్ 18.2.1తో సహా ఇటీవల ఐఓఎస్ అప్‌డేట్స్‌ ఈ సమస్యలకు కారణమని చాలా మంది వినియోగదారులు పేర్కొన్నారు.

ఓలా, ఉబర్ సంస్థలు..

యూజర్ల మొబైల్ ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా విభిన్న ప్రైసింగ్‌ విధానాలు అనుసరిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఓలా, ఉబర్‌లకు విడివిడిగా సీసీపీఏ నోటీసులు జారీ చేసింది. ఇలా విభిన్న ప్రైసింగ్‌ విధానంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇది అన్యాయమైన వాణిజ్య పద్ధతి అని, వినియోగదారుల హక్కులను నిర్దాక్షిణ్యంగా విస్మరించడమేనని మంత్రి జోషి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: నేడే హల్వా వేడుక.. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌

ఈ ఆరోపణలపై ఉబర్ స్పందిస్తూ.. ‘రైడర్ ఫోన్ కంపెనీ ఆధారంగా మేం ధరలను నిర్ణయించం. ఏవైనా అపోహలను తొలగించడం కోసం సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం’ అని తెలిపింది. యాపిల్‌, ఓలా సంస్థలు నోటీసులపై స్పందించలేదు.

Videos

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

త్వరలోనే జియో 6G టెక్నాలజీ...! ఆకాష్ అంబానీ కీలక ప్రకటన

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)