Breaking News

రూ.904 కోట్ల బ్యాంకు ఫ్రాడ్‌.. బిగ్‌ బజార్‌ అధినేతపై సీబీఐ కేసు

Published on Fri, 11/06/2026 - 17:32

ఫ్యూచర్ గ్రూప్ వ్యవస్థాపకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త కిషోర్ బియానీకి మరో పెద్ద చిక్కు ఎదురైంది. రూ.904.32 కోట్ల బ్యాంకు మోసం ఆరోపణలకు సంబంధించి ఆయనతో పాటు ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్‌పై సీబీఐ (CBI) కేసు నమోదు చేసింది. ఈ కేసులో కిషోర్ బియానీ సోదరుడు, ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన మరో కీలక ప్రమోటర్ రాకేశ్ బియానీ పేరును కూడా చేర్చింది. నవంబర్ 6న సీబీఐ అధికారులు ముంబైలోని బియానీ, కంపెనీకి సంబంధం ఉన్న పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్యాప్తునకు సంబంధించిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

ఎస్‌బీఐ ఫిర్యాదుతో కేసు..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ముంబైలోని స్ట్రెస్డ్ అసెట్స్ మేనేజ్‌మెంట్ బ్రాంచ్-III ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. నవంబర్ 4న ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఎస్‌బీఐతో పాటు తొమ్మిది బ్యాంకులతో కూడిన కన్సార్టియం నుంచి ఫ్యూచర్ రిటైల్ సంస్థ వివిధ రకాల రుణ సదుపాయాలను పొందినట్లు సీబీఐ పేర్కొంది. ఇందులో వర్కింగ్ క్యాపిటల్ రుణాలు, టర్మ్ లోన్లు, లెటర్స్ ఆఫ్ క్రెడిట్ వంటివి ఉన్నాయి.

అయితే బ్యాంకులు నిర్దేశించిన ప్రయోజనాల కోసం ఈ నిధులను వినియోగించలేదన్నది ప్రధాన ఆరోపణ. రుణాల రూపంలో పొందిన మొత్తాలను అనుబంధ సంస్థలు, సంబంధిత ఇతర కంపెనీల ద్వారా దారి మళ్లించి, స్వాహా చేసినట్లు ఎస్బీఐ తన ఫిర్యాదులో పేర్కొన్నట్లు సీబీఐ వెల్లడించింది. దీనివల్ల ఫిర్యాదు చేసిన బ్యాంకుకు రూ.904.32 కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు ఆరోపించింది.

ఈ వ్యవహారంలో కిషోర్ బియానీ, రాకేశ్ బియానీలతో పాటు గుర్తుతెలియని ప్రభుత్వ అధికారులు, ఇతర వ్యక్తుల ప్రమేయంపైనా దర్యాప్తు చేపట్టింది. నేరపూరిత కుట్ర, మోసం, అవినీతి నిరోధక చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదు చేసినట్లు సీబీఐ తెలిపింది. రుణాల నిధులు చివరకు ఎక్కడికి చేరాయి? వాటి వినియోగంలో ఎవరెవరి పాత్ర ఉంది? అనే అంశాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

ఇదీ చదవండి: భర్తను చంపడానికి భార్య స్కెచ్‌! ‘చాట్‌జీపీటీ’పై మర్డర్‌ కేసు!!

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)