Breaking News

కొత్త ఆదాయపన్ను చట్టానికి సిద్ధం కండి

Published on Thu, 01/08/2026 - 08:41

వచ్చే ఆర్థిక సంవత్సరం (ఏప్రిల్‌ 1 నుంచి) కొత్త ఆదాయపన్ను చట్టం అమల్లోకి రానున్నందున అధికారులు, అందుకు సంసిద్ధం కావాలని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) కోరింది. అధికారులు కొత్త చట్టాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, తగినంత స్పష్టతతో పనిచేస్తారన్న ఆశాభావాన్ని సీబీడీటీ చైర్మన్‌ రవి అగర్వాల్‌ వ్యక్తం చేశారు.

ఆదాయపన్ను శాఖ అధికారులకు నూతన సంవత్సరం సందర్భంగా ఇచ్చిన సందేశంలో ఈ విషయాన్ని పేర్కొన్నారు. కొత్త చట్టానికి మారేందుకు వీలుగా నిబంధనలు, విధానాలు, పత్రాల రూపకల్పన జరుగుతున్నట్టు, ఇందుకు సంబంధించి శిక్షణ కూడా కొనసాగుతున్నట్టు చెప్పారు. ఆదాయపన్ను శాఖ పరిపాలనను సీబీడీటీయే చూస్తుంటుంది. ఏప్రిల్‌ 1 నుంచి ఆదాయపన్ను చట్టం 1961 స్థానంలో.. ఆదాయపన్ను చట్టం 2025 అమల్లోకి రానుండడంతో ఇచ్చిన ఈ సందేశానికి ప్రాధాన్యం నెలకొంది.

‘‘మీ ప్రమేయం, ఉత్సాహం కొత్త చట్టానికి సాఫీగా మారడాన్ని నిర్ణయిస్తుంది. ఆదాయపన్ను శాఖ పాత్ర అన్నది పన్నుల వసూళ్లు, అమలు వరకే కాకుండా ప్రక్రియలను సులభతరం చేయడం, విశ్వాసం పెంపొందించడం, సేవల కేంద్రంగా మారుతోంది’’అని అగర్వాల్‌ తన సందేశంలో పేర్కొన్నారు.

Videos

రాయవరం ప్రజలు బాబుకు కౌంటర్ పేర్ని నాని ఫన్నీ రియాక్షన్

చిరు వెంకీ జస్ట్ టీజర్ మాత్రమే..! ముందుంది రచ్చ రంబోలా

హైకోర్టు తీర్పు ప్రభుత్వం, అధికారులకు చెంపపెట్టు: పేర్ని నాని

చాకిరీ మాకు.. పదవులు మీ వాళ్లకా? పవన్‌ను నిలదీసిన నేతలు

East Godavari: చంద్రబాబు బహిరంగ సభకు కనిపించని ప్రజా స్పందన

Business: భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం

తెలంగాణ డీజీపీకి హైకోర్టులో ఊరట..!

పోలీసుల తీరుపై మనోహర్ రెడ్డి ఫైర్

అర్ధ రూపాయి, రూపాయికి ఇస్తావా? లోకేష్ వ్యాఖ్యలకు పేర్ని నాని దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

ఏపీలో సంక్రాంతి రద్దీ.. బస్టాండ్లలో ప్రయాణికుల అవస్థలు

+5

రెడ్ శారీలో మెరిసిపోతున్న హీరోయిన్ నిధి అగర్వాల్

+5

నగరంలో హీరోయిన్‌ డింపుల్‌ హయతీ సందడి (ఫొటోలు)

+5

విజయవాడలో ఘనంగా మహిళా ఫెస్ట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో రాజాసాబ్.. డార్లింగ్ ప్రభాస్ ఫోటోలు చూశారా?

+5

జూబ్లీహిల్స్‌లో ‍సందడి చేసిన సినీ నటి నివేదా పేతురాజ్ (ఫొటోలు)

+5

అర్థరాత్రి విమల్ థియేటర్ వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ రచ్చ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు'లో మీనాక్షి చౌదరి.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

'అనగనగా ఒక రాజు' ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బ్రహ్మానందం, మంగ్లీ (ఫోటోలు)