Breaking News

ఐటీ రిటర్న్స్‌లో తప్పులు.. ట్యాక్స్‌ పేయర్లకు అప్‌డేట్‌

Published on Tue, 02/27/2024 - 22:24

ట్యాక్స్‌ పేయర్లకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (CBDT) ముఖ్యమైన అప్‌డేట్‌ ఇచ్చింది. 2021-22, 2022-23 సంవత్సరాలలో మీరు ఐటీ రిటర్న్స్‌ (ITR) ఫైల్ చేసివారికి ఇది ముఖ్యమైన వార్త.  మీ ఐటీఆర్‌లో కొన్ని తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉండవచ్చు. కొన్ని ఐటీఆర్‌లు, థర్డ్ పార్టీ సమాచారంలో వ్యత్యాసాలను గుర్తించామని, వాటిని సరిదిద్దాలని పన్ను చెల్లింపుదారులను సీబీడీటీ కోరింది. 

కొంతమంది పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లు, థర్డ్ పార్టీల నుంచి వచ్చిన డివిడెండ్‌లు, వడ్డీ ఆదాయానికి సంబంధించిన సమాచారంలో వ్యత్యాసాలను గుర్తించినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. పన్ను చెల్లింపుదారులు తమ అభిప్రాయాలను తెలియజేయడానికి  ఈ-ఫైలింగ్ పోర్టల్ అందుబాటులో ఉందని సీబీడీటీ ఒక ప్రకటనలో తెలిపింది.

డిపార్ట్‌మెంట్ వద్ద అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. పన్ను చెల్లింపుదారులకు ఎస్‌ఎంఎస్‌ ఈ-మెయిల్ ద్వారా వ్యత్యాసం గురించి  తెలియజేస్తున్నట్లు సీబీడీటీ తెలిపింది. వ్యత్యాసాన్ని స్పష్టం చేయలేని పన్ను చెల్లింపుదారులు ఆదాయాన్ని తక్కువగా నివేదించిన కేసును సరిచేయడానికి అప్‌డేటెడ్‌ ఐటీఆర్‌ సమర్పించే అవకాశాన్ని పరిగణించవచ్చని సీబీడీటీ పేర్కొంది. 
 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)