Breaking News

క్యాస్ట్రాల్‌ ఇండియాపై అరామ్‌కో కన్ను

Published on Fri, 03/07/2025 - 08:20

న్యూఢిల్లీ: గత నాలుగు రోజులుగా ర్యాలీ బాటలో సాగుతున్న లూబ్రికెంట్స్‌ తయారీ దిగ్గజం క్యాస్ట్రాల్‌ ఇండియా కౌంటర్‌కు మరోసారి డిమాండ్‌ పెరిగింది. దీంతో బీఎస్‌ఈలో షేరు 11 శాతం జంప్‌చేసి రూ. 246 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈలోనూ 10 శాతం ఎగసి రూ. 245 వద్ద నిలిచింది. ఒక దశలో 13.4 శాతం దూసుకెళ్లి రూ. 252 వద్ద గరిష్టానికి చేరింది.

ఎన్‌ఎస్‌ఈలో 7.39 కోట్ల షేర్లు, బీఎస్‌ఈలో 23.62 లక్షల షేర్లు ట్రేడయ్యాయి. బీపీ(గతంలో బ్రిటిష్‌ పెట్రోలియం)కు చెందిన లూబ్రికెంట్‌ బిజినెస్‌ను సౌదీ చమురు దిగ్గజం అరామ్‌కో కొనుగోలు చేయనున్నట్లు వెలువడిన వార్తలు షేరుపై సానుకూల ప్రభావం చూపుతున్నాయి. దీంతో వరుసగా నాలుగో రోజు క్యాస్ట్రాల్‌ ఇండియా బలపడింది.  

10 బిలియన్‌ డాలర్లు.. 
క్యాస్ట్రాల్‌ బ్రాండుతో బీపీ.. లూబ్రికెంట్స్‌ విక్రయించే సంగతి తెలిసిందే. బీపీ ఇటీవల పునర్వ్యవస్థీకరణలో భాగంగా లూబ్రికెంట్స్‌ విభాగం విలువను దాదాపు 10 బిలియన్‌ డాలర్లుగా మదింపు చేసినట్లు తెలుస్తోంది! కాగా.. వాల్వోలైన్‌ లూబ్రికెంట్స్‌ యూనిట్‌తో క్యాస్ట్రాల్‌ ఆస్తులను జత చేసే యోచనలో అరామ్‌కో ఉన్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

2023లో 2.65 బిలియన్‌ డాలర్లకు వాల్వోలైన్‌ను అరామ్‌కో కొనుగోలు చేసింది. భారత్, చైనా, ఆగ్నేయ ఆసియాలో అదనపు రిఫైనింగ్, కెమికల్స్‌ బిజినెస్‌ల కొనుగోలుకి చూస్తున్నట్లు అరామ్‌కో గతేడాది పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్యాస్ట్రాల్‌ ఇండియా కొనుగోలుపై అంచనాలు పెరిగినట్లు నిపుణులు తెలియజేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)