Breaking News

రెనోలో 3000 మంది బయటకు!: కారణం ఇదే..

Published on Sun, 10/05/2025 - 14:57

ప్రముఖ ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనాల్ట్.. ప్రపంచవ్యాప్తంగా 3,000 మంది ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమవుతోంది. ఈ ఏడాది చివరి నాటికి ఈ తొలగింపులకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

రెనాల్ట్ కంపెనీ.. హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్ విభాగాల్లో ఉద్యోగులను తొలగించనుంది. మొత్తం మీద సంస్థ తన మొత్తం ఉద్యోగులలో 15 శాతం తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ తొలగింపులు సంస్థ ప్రధాన కార్యాలయంతో పాటు.. ప్రపంచవ్యాప్తంగా ఇతర ప్రదేశాలలో కూడా ఉన్నాయి. ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రెనాల్ట్ కంపెనీ 2024 చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 98,636 మంది సిబ్బందిని నియమించింది. ''ఆటోమోటివ్ మార్కెట్‌లోని అనిశ్చితులు.. పోటీ వాతావరణం దృష్ట్యా, మా కార్యకలాపాలను సరళీకృతం చేయడానికి తగిన మార్గాలను పరిశీలిస్తున్నాము. ఇందులో భాగమని లేఆఫ్స్ కూడా చేయడానికి చూస్తున్నట్లు'' రెనాల్ట్ ప్రతినిధి పేర్కొన్నారు.

ఇదీ చదవండి: జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్ బోర్డులు: ఎందుకంటే?

రెనాల్ట్ జూలై ఆర్థిక నివేదిక ప్రకారం.. కంపెనీ ఈ ఏడాది మొదటి అర్ధభాగంలో 11.2 బిలియన్ యూరోల (13 బిలియన్ డాలర్లు) నష్టాన్ని చవిచూసింది. ఇందులో భాగస్వామి నిస్సాన్‌పై కూడా 9.3 బిలియన్ యూరోల నష్టం ఉంది. కంపెనీ నికర ఆదాయం కూడా 461 మిలియన్ యూరోలకు తగ్గిపోయింది. ఖర్చులు పెరగడం.. పెరుగుతున్న పోటీ వాతావరణం నుంచి ఉత్పన్నమయ్యే వాణిజ్య ఒత్తిళ్లు ఈ తగ్గుదలకు కారణమని సమాచారం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)