Breaking News

డెల్హివరి నుంచి కార్లయిల్‌ ఔట్‌ 2.53% వాటా విక్రయం

Published on Fri, 06/23/2023 - 06:05

న్యూఢిల్లీ: పీఈ దిగ్గజం కార్లయిల్‌ తాజాగా సప్లై చైన్‌ కంపెనీ డెల్హివరీలోగల మొత్తం వాటాను విక్రయించింది. ఓపెన్‌ మార్కెట్‌ లావాదేవీల ద్వారా 2.53 శాతం వాటాకు సమానమైన 1.84 కోట్లకుపైగా షేర్లను విక్రయించింది. బీఎస్‌ఈ బ్లాక్‌డీల్‌ వివరాల ప్రకారం షేరుకి రూ. 385.5 సగటు ధరలో వీటిని దాదాపు రూ. 710 కోట్లకు అమ్మివేసింది.

షేర్లను కొనుగోలు చేసిన జాబితాలో బీఎన్‌పీ పరిబాస్‌ ఆర్బిట్రేజ్, నార్జెస్‌ బ్యాంక్, సొసైటీ జనరాలి, సౌదీ సెంట్రల్‌ బ్యాంక్, వాషింగ్టన్‌ స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డ్‌ తదితరాలున్నాయి. ఎక్సే్ఛంజీ గణాంకాల ప్రకారం మార్చికల్లా డెల్హివరీలో యూఎస్‌ సంస్థ కార్లయిల్‌  2.53 శాతం వాటాను కలిగి ఉంది. గతేడాది నవంబర్‌లో డెల్హివరీలో 2.5 శాతం వాటాను కార్లయిల్‌ రూ. 607 కోట్లకు విక్రయించిన సంగతి తెలిసిందే.  
ఈ వార్తల నేపథ్యంలో డెల్హివరీ షేరు బీఎస్‌ఈలో 0.5 శాతం నీరసించి రూ. 387 వద్ద ముగిసింది. 

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)