Breaking News

ఇల్లు అమ్మితే లాభం సంగతి..

Published on Mon, 02/26/2024 - 07:24

మూలధన లాభం స్వల్పకాలికమా లేదా దీర్ఘకాలికమా..అన్నది మీ చేతుల్లోనే ఉంటుంది. మామూలు శ్లాబులు .. మామూలు రేట్లే స్వల్పకాలికానికి. ఈ వారం దీర్ఘకాలికం విషయం గురించి ఆలోచిద్దాం. 

♦ దీర్ఘకాలిక మూలధన లాభం మీద పన్ను రేటు 20 శాతం. 

♦ ఇది వ్యక్తులకు, హిందు ఉమ్మడి కుటుంబాలకు మాత్రమే.  

♦ ఈ ప్రత్యేక రేటు వర్తింప చేయడం వల్ల 

♦ ఈ మూలధన లాభాన్ని ఇతర ఆదాయాలతో కలపరు. 

♦ గతవారం మనం చూసిన ఉదాహరణలో ఆనందరావు గారి పెన్షన్‌ రూ. 10,00,000. ఇంటద్దె రూ. 3,00,000, వడ్డీ రూ. 2,00,000, మూలధన లాభం (దీర్ఘకాలికం) రూ. 20,00,000 అనుకోండి. 2024 మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పెన్షన్, ఇంటద్దె, వడ్డీలు మొత్తం రూ. 15,00,000లో సేవింగ్స్‌ రూ.2,00,000 తీసివేసి తదనుగుణమైన రేట్ల ప్రకారం పన్ను లెక్కిస్తారు. 

♦ మూలధనలాభాలు దీర్ఘకాలికం కాబట్టి వాటిని ప్రత్యేకంగా భావించి కేవలం 20 శాతం చొప్పున లెక్కిస్తారు. దీనికి విద్యా సుంకం అదనం. 

♦మూలధన లాభాలకు బేసిక్‌ లిమిట్‌ని వర్తింపచేస్తారు. 

♦ఉదాహరణకు 60 ఏళ్ల సత్యనారాయణ గారికి ఇతర ఏ ఆదాయాలు లేవు అనుకుందాం. వారికి దీర్ఘకాలిక మూలధన లాభాలు రూ. 2,50,000 అనుకోండి. పన్ను కట్టక్కర్లేదు. 

♦ఇలాంటి బేసిక్‌ లిమిటు 60 ఏళ్లు దాటి 80వ సంవత్సరంలో ఉన్న వారికి రూ. 3,00,000 చొప్పున, 80 ఏళ్లు దాటినవారికి రూ. 5,00,000 వర్తింపచేస్తారు. 

♦అయితే, ఇతర ఆదాయం ఉండి ఉంటే ఆ ఆదాయంలో నుంచి సెక్షన్‌ 80సీ మొదలైన వాటిని తగ్గిస్తారు. ఉదాహరణకు, ఇతర ఆదాయం రూ. 1,50,000 ఉంటే, నిజంగా సేవ్‌ చేసి ఉంటే మినహాయింపు దొరుకుతుంది.  

♦కేవలం దీర్ఘకాలిక మూలధన లాభం ఉంటే అందులో నుంచి సెక్షన్‌ 80సీ మొదలైన మినహాయింపులు, తగ్గింపులు రావు. ఇవ్వరు. 

♦ 80సీ నుంచి 80 యు వరకు అమల్లో ఉన్న ప్రయోజనాలు ఇవ్వరు. 

♦పైన చెప్పిన రూల్సు రెసిడెంటు వ్యక్తులకు మాత్రమే వర్తిస్తాయి.  

♦మూలధన లాభం మీద బేసిక్‌ రేటు 20 శాతం, విద్యా సుంకం, పరిమితి దాటితే సర్‌చార్జీ కూడా పడుతుంది.   

Videos

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)