Breaking News

పట్టణాల్లోని మౌలిక సదుపాయాలపై కాగ్‌ అసంతృప్తి

Published on Fri, 09/19/2025 - 13:31

భారత పట్టణ మౌలిక సదుపాయాలు, పాలనా వ్యవస్థలను అప్‌గ్రేడ్‌ చేయాల్సిన తక్షణ అవసరాన్ని భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఎత్తిచూపింది. ఇప్పుడున్న పట్టణ సర్వీసులు, మౌలిక సదుపాయాలు ప్రస్తుత భారతదేశ ఆర్థిక సామర్థ్యాన్ని వెనక్కి నెట్టివేసేలా ఉన్నాయని కాగ్‌ చీఫ్‌ కె.సంజయ్‌ మూర్తి హైలైట్‌ చేశారు. దేశం వికసిత్ భారత్ 2047 విజన్ వైపు ముందుకు సాగుతున్నప్పుడు ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతుండడం ఆందోళన రేకిత్తిస్తున్నట్లు కొందరు నిపుణులు చెబుతున్నారు.

కాగ్‌ డేటాలోని ముఖ్యాంశాలు..

  • పట్టణ కేంద్రాలు భారతదేశ ఆర్థిక వృద్ధికి ఇంజిన్లుగా మారాయి. అయినప్పటికీ వాటి వృద్ధికి మద్దతు ఇచ్చే మౌలిక సదుపాయాలు ప్రమాదకరంగా వెనుకబడి ఉన్నాయి.

  • కేవలం 15 భారతీయ నగరాలు జాతీయ జీడీపీలో 30% వాటాను కలిగి ఉన్నాయి.

  • దేశంలో మూడింట ఒక వంతు జనాభాకు నిలయమైన పట్టణ ప్రాంతాలు ఇప్పటికే జీడీపీలో మూడింట రెండో వంతుకు సహకరిస్తున్నాయి.

  • ఈ వాటా 2030 నాటికి 75%కి పెరుగుతుందని అంచనా.

  • పట్టణాలకు ప్రాముఖ్యత పెరుగుతున్నప్పటికీ, భారతదేశ నగరాలు పేలవమైన మౌలిక సదుపాయాలు, నమ్మశక్యం కాని సర్వీసులు, మితిమీరిన మునిసిపల్ వ్యవస్థలతో నెట్టుకొస్తున్నాయి.

  • భారతదేశంలో దాదాపు 5,000 పట్టణ స్థానిక పరిపాలన వ్యవస్థలు (యూఎల్‌జీ) జనాభాలో 35% మందికి సేవలందించాయి. ఈ సంఖ్య 2031 నాటికి 41%కు చేరుకుంటుందని అంచనా.

  • యూఎల్‌జీలు మొత్తంగా రూ.5.5–6 లక్షల కోట్ల సామూహిక వనరుల పూల్‌ను నిర్వహిస్తున్నాయి.

  • పట్టణ పరిపాలన వ్యవస్థల్లో మెరుగైన ఆర్థిక ప్రణాళికలు, పారదర్శకత, సకాలంలో ఆడిట్‌లు, ప్రామాణిక పనితీరు కొలమానాల అవసరం ఉంది.

ఎన్ఎంఏఎం 2.0 ప్రారంభం

ఈ వ్యవస్థల సంస్కరణ కోసం కాగ్ నేషనల్ మునిసిపల్ అకౌంట్స్ మాన్యువల్ (ఎన్ఎంఏఎం) పునరుద్ధరణను సూచించింది. ఇది మొదట 2004లో రూపొందించారు. కానీ దీన్ని సమర్థంగా అమలు చేయడంలో యంత్రాంగాలు ఆసక్తి చూపలేదు. ‘ఎన్ఎంఏఎం కొత్త వెర్షన్ నగరాల్లో సమయానుకూలమైన, ప్రామాణిక ఆర్థిక రిపోర్టింగ్‌ను ప్రారంభించడం లక్ష్యంగా పెట్టుకుంది’ అని సంజయ్‌ మూర్తి చెప్పారు. నవీకరించిన ఎన్ఎంఏఎం 2.0 యూఎల్‌జీల ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకత, పనితీరు ట్రాకింగ్‌ను మెరుగుపరుస్తుందని భావిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి: పోస్టాఫీసుల్లో బీఎస్‌ఎన్‌ఎల్‌ సిమ్‌లు అమ్మకం

Videos

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

నామినేషన్ వేసిన అనంతపురం YSRCP మేయర్ అభ్యర్థి

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

Photos

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)