Breaking News

ట్రంప్ సుంకాలకు చెక్‌ పెట్టే ఎగుమతి ప్రోత్సాహక మిషన్

Published on Thu, 11/13/2025 - 09:05

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సుంకాల ప్రభావం నుంచి భారతదేశ ఎగుమతి రంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.25,060 కోట్ల వ్యయంతో కూడిన ఐదేళ్ల ఎగుమతి ప్రమోషన్ మిషన్ (EPM)కు ఆమోదం తెలిపింది. పెరుగుతున్న అంతర్జాతీయ వాణిజ్య అనిశ్చితుల మధ్య భారతీయ ఎగుమతులకు ఊతం ఇచ్చేలా ప్రయత్నిస్తుంది.

అదనంగా రూ.20,000 కోట్ల క్రెడిట్ గ్యారెంటీ

చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు (MSME) ఉపశమనం ఇస్తూ ఎగుమతిదారుల కోసం క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని కింద నేషనల్ క్రెడిట్ గ్యారెంటీ ట్రస్టీ కంపెనీ లిమిటెడ్ (NCGTC) MSMEలతో కలిసి అర్హత కలిగిన ఎగుమతిదారులకు అదనపు రుణాల రూపంలో బ్యాంకులకు రూ.20,000 కోట్ల వరకు క్రెడిట్ గ్యారెంటీ కవరేజీని విస్తరించనుంది.

టారిఫ్‌లను ఎదుర్కోవడానికి..

ఇటీవల యూఎస్‌ సుంకాల పెరుగుదల వల్ల ఎక్కువగా ప్రభావితమైన వస్త్రాలు, తోలు, రత్నాలు, ఆభరణాలు, ఇంజినీరింగ్ వస్తువులు, సముద్ర ఉత్పత్తులతో సహా కీలక రంగాలకు ఎగుమతి ప్రమోషన్ మిషన్ ప్రాధాన్యత ఇస్తుంది. ఎగుమతి ఆర్డర్లను కొనసాగించడానికి, ఉద్యోగాలను రక్షించడానికి కొత్త ప్రాంతాల్లో మార్కెట్‌ విస్తరణ ఎంతో తోడ్పడుతుందని ప్రభుత్వం పేర్కొంది.

ఎగుమతి ప్రమోషన్ మిషన్ ద్వారా వడ్డీ రాయితీ, కొలేటరల్ గ్యారెంటీలు, ఈ-కామర్స్ ఎగుమతిదారుల కోసం క్రెడిట్ కార్డులు, మార్కెట్ వైవిధ్యం కోసం క్రెడిట్ మెరుగుదల యంత్రాంగాలను అందిస్తారు. ఇది అంతర్జాతీయ బ్రాండింగ్, ప్యాకేజింగ్, ట్రేడ్ ఫెయిర్లలో పాల్గొనడానికి ఎగుమతిదారులకు మద్దతు ఇస్తుంది.

ఇదీ చదవండి: మార్జిన్‌ ట్రేడింగ్‌పై పెరుగుతున్న ఆసక్తి

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)