Breaking News

ఎయిరిండియా సిబ్బందికి షేరింగ్‌ రూమ్‌

Published on Wed, 10/02/2024 - 20:00

ఎయిరిండియా దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో పనిచేసే సిబ్బందికి సంబంధించిన నియమాల్లో మార్పులు చేస్తున్నట్లు కొందరు అధికారులు తెలిపారు. లేఓవర్ల(విమాన ప్రయాణంలో విశ్రాంతి తీసుకోవడం) సమయంలో సిబ్బంది పరస్పరం గదులను పంచుకునేలా నిబంధనలు తీసుకురాబోతున్నట్లు చెప్పారు. దాంతోపాటు అంతర్జాతీయ విమానాల క్యాబిన్ సిబ్బందికి అలవెన్సులు పెంచే అవకాశం ఉందని పేర్కొన్నారు.

మీడియా కథనాల ప్రకారం..విమాన ప్రయాణంలో సిబ్బంది విశ్రాంతికి ప్రత్యేకంగా గదులు ఏర్పాటు చేయబోతున్నారు. వీటిని ఇతర సిబ్బందితో పంచుకోవాల్సి ఉంటుంది. ఎయిరిండియా ఆధ్వర్యంలో ఉన్న ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, విస్తారాలో క్యాబిన్ సిబ్బందికి రూమ్ షేరింగ్ సౌలభ్యం ఇప్పటికే ఉంది. అయితే ఎయిరిండియా ఎయిర్‌క్రాఫ్ట్‌ల్లో వీటిని ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి.

ఇదీ చదవండి: ఇజ్రాయెల్‌-ఇరాన్ దాడి.. పలు విమానాలు రద్దు

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..అంతర్జాతీయ విమానాల క్యాబిన్ సిబ్బందికి అలవెన్సులు పెంచుతున్నారు. 75-125 డాలర్ల నుంచి 85-135 డాలర్లకు పెంచబోతున్నారు. ఇటీవల ఏఐఎక్స్‌ కనెక్ట్‌ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌లో విలీనం అయిన విషయం తెలిసిందే. అయితే సవరించిన నియమాలు ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్‌కు మాత్రం వర్తించవు. రాత్రిపూట విధులు నిర్వర్తించే దేశీయ విమానాల క్యాబిన్ సిబ్బంది రూ.1,000 అలవెన్స్‌ కోరేందుకు అర్హత పొందేలా నిబంధనల్లో సవరణలు చేయనున్నారు. విమానంలో మేనేజర్లు, ఎగ్జిక్యూటివ్‌లు మినహాయించి క్యాబిన్ సిబ్బంది లేఓవర్‌ల సమయంలో గదులను పంచుకోవాల్సి ఉంటుందని ఒక సీనియర్‌ అధికారి పేర్కొన్నారు.

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)