లాంచ్‌కు సిద్దమవుతున్న కొత్త కారు ఇదే - టెస్లాకు గట్టి పోటీ!

Published on Sun, 02/18/2024 - 16:03

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఈవీ తయారీదారు బీవైడీ ఆటో భారతీయ మార్కెట్లో తన సీల్ మిడ్-సైజ్ సెడాన్‌ను మార్చి 5న లాంచ్ చేయనుంది. దేశీయ మార్కెట్లో లాంచ్ కావడానికి సిద్దమవుతున్న ఈ కొత్త చైనా మోడల్ బ్యాటరీ, రేంజ్ వంటి వివరాలు ఇప్పటికే తెలిసిపోయాయి.

బీవైడీ కంపెనీ లాంచ్ చేయనున్న సీల్ ఈవీ 61.4 కిలోవాట్, 82.5 కిలోవాట్ బ్యాటరీ పొందనుంది. ఈ రెండు బ్యాటరీలు ఒక సింగిల్ చార్జితో 550 కిమీ, 700 కిమీ రేంజ్ అందిస్తాయని కంపెనీ వెల్లడించింది. పెద్ద బ్యాటరీ ప్యాక్ కోసం 150 kW ఛార్జర్, చిన్న బ్యాటరీ కోసం 110 kW ఛార్జర్ సపోర్ట్ చేస్తుంది.

బీవైడీ సీల్ ఈవీ 3.8 సెకన్లలో గంటకు 0 నుంచి 100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. డిజైన్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు 15.6 ఇంచెస్ రొటేటింగ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 ఇంచెస్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, హెడ్స్ ఆఫ్ డిస్‌ప్లే, రెండు వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్స్ వంటి అనేక ఫీచర్స్ పొందుతుంది.

స్వెప్ట్‌బ్యాక్ హెడ్‌ల్యాంప్‌లు, ర్యాప్‌రౌండ్ ఎల్ఈడీ టైల్‌లైట్లు, ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, పనోరమిక్ సన్‌రూఫ్, 360 డిగ్రీ కెమెరా, సేఫ్టీ కోసం ఏడీఏఎస్ వంటి ఫీచర్స్ ఉంటాయి. కంపెనీ బీవైడీ సీల్ ఈవీ కోడం త్వరలోనే బుకింగ్స్ ప్రారంభించనుంది. దీని ధర రూ. 65 లక్షల నుంచి రూ. 70 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉండవచ్చని అంచనా.

ఇదీ చదవండి: 20 ఏళ్లకే క్యాన్సర్‌.. 33 ఏళ్లకు రూ.420 కోట్లు - ఎవరీ కనికా టేక్రీవాల్‌..

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)